సల్మాన్‌తో ముద్దు.. భలే ఉందన్న హీరోయిన్

by Shyam |
సల్మాన్‌తో ముద్దు.. భలే ఉందన్న హీరోయిన్
X

దిశ, సినిమా : ‘రాధే ది మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమా రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. సల్మాన్ ఖాన్, దిశా పఠానీ జంటగా నటించిన సినిమాలో ఓ ముద్దు సీన్ పాపులర్ అయిపోయింది. ట్రైలర్‌లోనే ఈ కిస్సింగ్ సీన్‌ను చూపించిన మేకర్స్ అటు ఇండస్ట్రీ ఇటు ఆడియన్స్ భారీ డిస్కషన్ పెట్టేలా చేశారు. ఆన్ స్క్రీన్ ‘నో – కిస్సింగ్’ పాలసీని ఫాలో అయిపోయే సల్మాన్.. దిశను ముద్దు పెట్టుకుని ఈ పాలసీని బ్రేక్ చేశాడా? అని చర్చించుకున్నారు. పైగా ఈ సీన్ కోసమే సినిమా చూస్తున్నవారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

ఈ క్రమంలో ఈ ముద్దు సన్నివేశంపై స్పందించింది దిశ. ఇది చాలా ఫన్సీ ఎక్స్‌‌పీరియన్స్.. అసలు అన్‌కంఫర్ట్‌గా అనిపించలేదని తెలిపింది. సల్మాన్ సెట్స్‌లో ఎప్పుడూ జోక్ చేస్తూనే ఉంటాడన్న దిశ.. యాక్టర్స్‌గా డైరెక్టర్స్ విజన్‌ను ఫాలో అయిపోవాలని, అందుకే ఈ కిస్ సీన్ చేయాల్సి వచ్చిందని వివరించింది.

Advertisement

Next Story