నమ్మశక్యంగా లేదు.. రహస్య ప్రేమికుడిపై హీరోయిన్ కామెంట్

by Shyam |   ( Updated:2021-08-11 05:16:15.0  )
నమ్మశక్యంగా లేదు.. రహస్య ప్రేమికుడిపై హీరోయిన్ కామెంట్
X

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్ట్రెస్ దిశా పటానీ తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది. తాజాగా ‘వందేమాతరం’ పేరుతో రిలీజైన దేశభక్తి గీతంలో కనిపించిన టైగర్.. ఈ పాటను తనే ఆలపించడం విశేషం. కాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో సాంగ్‌ షేర్ చేసిన దిశా.. ఈ పర్ఫార్మెన్స్ నమ్మశక్యంగా లేదంటూ టైగర్ ఫేస్ ఎమోటికాన్ పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన టైగర్.. ‘థాంక్యూ సో మచ్ డీ’ అంటూ రెడ్ హార్ట్ ఎమోటికాన్‌తో రిప్లయ్ ఇచ్చాడు. అయితే దిశా మాత్రమే కాకుండా లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే సైతం ఈ పాట్రియాటిక్ సాంగ్‌పై ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు కురిపించింది. ఇక దిశా, టైగర్‌ల లవ్ స్టోరీ విషయానికొస్తే.. ‘భాగీ-2’లో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట అప్పటి నుంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నట్టు రూమర్స్ వినబడుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటివరకు వారిద్దరూ పెదవి విప్పలేదు. కానీ ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్టులకు మాత్రం ఒకరికొకరు కామెంట్ చేసుకుంటూ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed