- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశ్వసనీయ సమాచార వేదిక 'దిశ'
- సమాజంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన మీడియాపై ఇటీవలి కాలంలో రకరకాల అసంతృప్తులు వస్తున్నాయని, ఆ వెలితిని పూడ్చడంలో ‘దిశ’ సఫలీకృతం కావాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. పత్రికల్లో చదివే వార్తలతో పాఠకులు, ప్రజలు ఒక స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోతున్నారని, టీవీ ఛానెళ్ళలో వచ్చే అస్పష్ట వార్తలు వాస్తవాన్ని తెలియజేయలేకపోతున్నాయన్నారు. పత్రికలు, టీవీ ఛానెళ్ళకు తోడుగా ఇటీవలి కాలంలో కొద్దిమంది వ్యక్తులు డిజిటల్ ప్లాట్‌ఫారంను ఎంచుకుని వారి స్వంత అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని, ఇవి అభిప్రాయాలే మాత్రమేగానీ మీడియాగా భావించలేమని అన్నారు. ఇలాంటి వెలితిని ‘దిశ’ భర్తీ చేయాలని ఆయన కోరారు. రెండు మూడు ఇంగ్లీషు వెబ్‌సైట్‌లు విశ్లేషణలతో ఆదరణ పొందాయని, తెలుగు భాషలో సైతం ‘దిశ’ ఆ పాత్ర పోషించాలని కోరారు. ప్రశాంతి మీడియా సంస్థ నుంచి వెలువడిన ‘దిశ’ వెబ్‌సైట్, వెబ్ ఛానెల్, ఈ-పేపర్, మొబైల్ యాప్‌లను ఘంటా చక్రపాణితో పాటు తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ప్రశాంతి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ప్రశాంతి, మేనేజింగ్ డైరెక్టర్ మోహన్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి పై వ్యాఖ్యలు చేశారు.
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా వార్తల సేకరణ, ప్రచురణ, ప్రసారం వేగవంతమైందని, డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాల్లో కనిపించే వార్తలకు విశ్వసనీయత లేకుండా పోయిందని, అందులో వాస్తవమెంతో, ఎక్కడి నుంచి వెలువడుతున్నాయో స్పష్టత లేదని ఘంటా చక్రపాణి వ్యాఖ్యానించారు. కరోనా అంశాన్నే తీసుకుంటే చదువుతున్న యువత సైతం భయాందోళనలకు గురయ్యారని, ప్రసారమాధ్యమాలు, సోషల్ మీడియాల్లో వచ్చిన ప్రచారం కూడా ఇందుకు కారణమన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో సోషల్ మీడియా చాలా బలమైన మాధ్యమంగా అవతరించిందని, అదే సమయంలో విశ్వసనీయమైన వార్తలను ‘దిశ’ ఇవ్వగలుగుతుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. ఒక స్పష్టమైన లక్ష్యంతో, బాధ్యతతో ఉనికిలోకి వచ్చిన ఈ సంస్థ లోతైన అంశాలను, విశ్లేషణలను అందిస్తుందన్న అభిప్రాయపడ్డారు. కొద్దిమంది వ్యక్తుల, సామాజికవర్గాల, రాజకీయ పార్టీల ప్రయోజనాలకోసం కాకుండా సామాన్య ప్రజల, మొత్తం సమాజానికి సంబంధించిన సమస్యలు, అంశాలు ఉన్నప్పుడే అది బాధ్యతాయుతమైన మీడియా అవుతుందన్నారు. దీన్ని ’దిశ’ నిర్వర్తించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, ప్రసార మాధ్యమాలలో ప్రస్తుతం డిజిటల్ మీడియా మొబైల్ ఫోన్‌లో వేగంగా సమాచారం అందించడంలో కీలక భూమిక పోషిస్తోందన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఎక్కువయ్యాయని, ‘దిశ’ ఆ దశను మార్చే విధంగా ముందుకు సాగుతుందని ఆకాంక్షించారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా నిమిషాలు, గంటల వ్యవధిలో వార్తలు ఆయా గమ్యాలను చేరుతున్నాయని చెప్పారు. సమాచార సేకరణ ఎలా ఉన్నప్పటికీ చేరవేయడంలో మాత్రం చాలా వేగం పెరిగిందని, దానికి తగినట్లుగానే పాత్రికేయులపై ఒత్తిడి, పోటీ పెరిగిందన్నారు. ప్రింట్ మీడియా ఉన్నప్పటి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ మీడియా (టీవీ ఛానెళ్ళు) చాలా మార్పు తెచ్చిందని, ఇప్పుడు సోషల్ మీడియా మరింత దూకుడుగా ఉందని, ఈ అన్ని రకాల మాధ్యమాలను ‘దిశ’ భర్తీ చేస్తుందన్న నమ్మకం కలిగిందని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉనికిలోకి వచ్చిన ఒక పత్రిక డిజైన్ ఎలా ఉండేదో ఇప్పుడు ‘దిశ’ పత్రిక స్వరూపం కూడా అదే తీరులో ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు.
‘దిశ’ న్యూస్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో దిశ డిజిటల్ మీడియా( ప్రశాంతి మీడియా ప్రైవేట్ లిమిటెడ్) చైర్ పర్సన్ డాక్టర్ ప్రశాంతి, ఎండీ. మోహన్‌రావు, ‘దిశ’ ఎడిటర్ డి.మార్కండేయ, సీఈవో ఎం.కమల్‌నాథ్, సిబ్బంది, జర్నలిస్టులు పాల్గొన్నారు. హోలీ పండుగ ఇతివృత్తంతో ‘దిశ’ టీవీ రూపొందించిన వీడియో పాట ఆకట్టుకుంది.