- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ ఎఫెక్ట్.. ప్రభుత్వ ఆస్పత్రిలో అల్పాహారం పంపిణీ
by Sridhar Babu |
X
దిశ, గోదావరిఖని: గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో “దిశ” దినపత్రికలో ‘పండుగ అని పేషెంట్లకు అన్నం పెట్టని వైనం’ అనే వార్త ప్రచురితం కావడంతో స్పందించిన గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కంది శ్రీనివాస్ రెడ్డి వెంటనే ఆస్పత్రి సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు. డెలివరీ అయిన బాలింతలకు యుద్ధ ప్రాతిపదికన అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. దీంతో స్పందించిన సూపరింటెండెంట్ తీరుపై ఆస్పత్రిలోని బాలింతల బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసరంగా స్పందించి సూపరింటెండెంట్ ఆదేశానుసారం బాలింతలకు అల్పాహారాన్ని పంపిణీ చేసిన ప్రేమ్ సాగర్‌ను పలువురు అభినందించారు.
Advertisement
Next Story