కరోనాను లైట్ తీసుకుంటే.. అంతే : తేజ

by Shyam |   ( Updated:2020-06-13 03:03:06.0  )
కరోనాను లైట్ తీసుకుంటే.. అంతే : తేజ
X

కరోనా కేసులు సింగిల్ డిజిట్‌లో నమోదైనప్పుడు ‘అమ్మో కరోనా’ అంటూ భయపడిపోయిన జనం.. ప్రస్తుతం కేసుల సంఖ్య లక్షల్లో ఉన్నప్పటికీ లైట్ తీసుకుంటున్నారనేది సత్యం. కానీ ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మిమ్మల్ని కాపాడే నాథుడు ఉండడని హెచ్చరిస్తున్నాడు దర్శకుడు తేజ. ‘ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే.. నేను మంచోడిని నాకు కరోనా రాదు.. నేను కలిసేవాళ్లకు కూడా కరోనా లేదు అన్నట్లుగా ఉంది’ అన్నారు తేజ. ఇలాంటి భ్రమలో బతికితే కరోనా నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టదు అన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

‘నువు పనిమీద బయటకెళ్ళిన ప్రతీసారి శానిటైజ్ చేసుకోవడం ఉత్తమం’ అని సూచించారు. కరోనా అన్ని చోట్ల ఉందన్న వాస్తవాన్ని గుర్తించి ఎవరి జాగ్రత్తలో వాళ్లుంటేనే మన ఇండియాను, మన జనాన్ని రక్షించికోగలం.. కాదని ఇదే నిర్లక్ష్య ధోరణి వహిస్తే.. కోట్ల మందిని కోల్పోయి ఇండియా కరోనా ప్రభావిత దేశాల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందన్నారు తేజ. ‘దయచేసి ప్రతీ ఒక్కరికీ కరోనా ఉందనే నమ్మండి.. వారికి దూరంగా ఉండండి.. అప్పుడే బతకగలం.. కరోనా మహమ్మారి పై విజయం సాధించగలం’ అని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed