కరోనా వైరస్‌కు రుణపడి ఉంటా : ఆర్జీవీ

by Shyam |
కరోనా వైరస్‌కు రుణపడి ఉంటా : ఆర్జీవీ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంట్రవర్సీ కింగ్, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆర్జీవీ ఏం చేసినా సంచలనం కావడమే కాకుండా వినూత్నంగా కూడా ఉంటుంది. ఎంత విపత్కర పరిస్థితుల్లోనైనా తాను చేయాలనుకున్నది చేసి చూపిస్తాడు. కరోనా వైరస్ విస్తృతవ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ కాలంలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఉండగా, ఆర్జీవీ మాత్రం సినిమాల మీద సినిమాలు చేశారు. లాక్‌డౌన్ సమయంలో షూటింగులకు బ్రేక్ పడినా వర్మ మాత్రం ఎక్కడా తగ్గలేదు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కొన్ని సినిమాలు తెరకెక్కించి ఓటీటీ ద్వారా రిలీజ్ చేశారు. తాజాగా కరోనా మహమ్మారినే కథగా చేసుకుని ఆర్జీవీ కరోనా వైరస్ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఎలాగైన థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో సినిమా థియేటర్లు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లలో ఈ చిత్రమే మొదటిసారిగా విడుదల అవుతుంది.

అయితే శనివారం ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ చిత్ర ప్రెస్‌మీట్‌లో వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‌నన్ను నమ్మి ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ ధన్యవాదాలు. లాక్‌డౌన్‌లో హీరోలు, దర్శకులు అంట్లు తోముకుంటూ, వంటలు వండుకుంటూ, ఇళ్లు ఊడ్చుకుంటూ టైమ్ పాస్ చేస్తే, తాము మాత్రం సినిమాలు తీశామని, కరోనా వైరస్ దీవెనలు తమకు ఉన్నాయని, దాని వల్లే ఎవరూ వైరస్ బారిన పడకుండా కరోనా సినిమా తీయగలిగామని, కరోనా వైరస్‌కు తాను బుణపడి ఉన్నానన్నారు.’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed