- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనతా కర్ఫ్యూ… పూరీ మార్క్ సూచనలు
ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాధ్ జనతా కర్ఫ్యూని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్టు చేశాడు. అందులో పెద్దలు ఎందుకు చెప్పారో.. జనతా కర్ఫ్యూని పాటించి విజయవంతం చేద్దామని చెప్పాడు. అలా చేస్తే కరోనా వైరస్ చైన్ కట్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. కాబట్టి పెదల మాటను గౌరవించి ఇంట్లోనే ఉందామని సూచించారు. ఇన్ని గంటలు ఇంట్లో ఉండలేని వారు తెల్లవారు లేచిన తరువాత నాలుగు స్పూన్లు ఆముదం తాగండి.. విరేచనాలు అవుతాయి. ఆ పనిలో బిజీగా ఉంటారు సాయంత్రమైపోతుందని అన్నాడు. లేదూ కరోనా లేని ఊరికెళ్లిపోదామని ఎవరైనా అనుకుంటే మాత్రం చైనాలోని వూహాన్ నగరానికి వెళ్లిపోవాలని సూచించారు. అక్కడ మాత్రమే కరోనా లేదని నవ్వాడు. చైనా వాళ్లంతా కలసి కట్టగట్టుకుని కరోనా వైరస్‌ను చావగొట్టారని.. ఇప్పుడు మన బాధ్యత అని పిలుపునిచ్చాడు. సాయంత్రం వరకు ఇంట్లోనే ఉందామని పూరీ సూచించాడు.
Tags: puri jagannadh, director puri, twitter