- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పూరి మ్యూజింగ్స్: విడాకులు వద్దంటే నేను చెప్పినట్టు చేయండి
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ఈ లాక్ డౌన్ సమయంలో తన భావాలను ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో ఆడియో రూపంలో అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. మంచిలో ఉండే భావోద్వేగాలు, ప్రతి ఒక్కరికి ఎదురయ్యే కష్టాలు, వాటికి సమాధానాలను తన ఆలోచన విధానంలో తెలుపుతున్నారు. ప్రస్తుతం ‘పూరీ మ్యూజింగ్స్’ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇప్పటికే పెళ్లి, పిల్లలు, గొడవలు అంటూ పలు విషయాలను చర్చించిన పూరి తాజాగా విడాకుల విషయాన్ని ప్రస్తావించాడు. లాక్ డౌన్ సమయంలో భార్యాభర్తలకు విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి..? విడాకులు అవ్వకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఎలాంటి పనులు చేయాలి అనేది ఇందులో వివరించాడు.
భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అధిక అంచనాలు కలిగి ఉండడం స్వేచ్ఛ విడాకులకు ప్రధాన కారణాలు. ఈ లాక్‌డౌన్ వలన మగవాళ్లు, ఆడవాళ్లు ఇంట్లోనే ఉండడం వలన ఎక్కువ గొడవలు అయి విడాకులు తీసుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక విడాకులు ఈ కరోనా సమయంలోనే అయ్యాయని పూరి తెలిపాడు. మరి దీనికి పరిష్కారం ఏంటి అనేది కూడా చక్కగా వివరించాడు. భార్యాభర్తలు ఇద్దరు ఎక్కువ సమయాన్ని గడపకూడదు.. రోజులో 30 నిమిషాల కంటే ఎక్కువ ఇద్దరు ఒక చోట కలిసి ఉండకూడదు. ఖాళీ ఉంటే మీ స్నేహితులతో మాట్లాడండి. టీవీ చూడండి.. వాట్సాప్ లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచండి. అప్పుడే విడాకులవ్వకుండా ఈ మహమ్మారిలో కాపాడుకోగలరు అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రస్తుతం పూరి, రౌడీ విజయ్ దేవరకొండ తో ‘లైగర్’ సినిమా నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గ తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ని మొదలుపెట్టనుంది.