టీఆర్‌ఎస్‌నే గెలిపించాలి : దర్శకుడు ఎన్‌ శంకర్

by Anukaran |
టీఆర్‌ఎస్‌నే గెలిపించాలి : దర్శకుడు ఎన్‌ శంకర్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కోరగా, తాజాగా శంకర్ కూడా గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌నే గెలిపించాలని అన్నారు. శనివారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ… రాజకీయాల కోసం ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు చేయొద్దని బీజేపీ నాయకులకు సూచించారు. ఓట్ల కోసం మనుషుల్ని మతాల వారీగా, కులాల వారీగా చీల్చొద్దని తెలిపారు. హైదరాబాద్‌కు మతకలహాల చేదు అనుభవం మళ్లీ అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సీఎం కేసీఆర్‌ ప్రశాంతంగా సాగిందని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed