ముద్దు సీన్ రిహార్సల్స్ చేద్దామని పిలిచి.. అలా చేసే సరికి : Zareen Khan

by Shyam |   ( Updated:2021-06-05 07:02:21.0  )
ముద్దు సీన్ రిహార్సల్స్ చేద్దామని పిలిచి.. అలా చేసే సరికి : Zareen Khan
X

దిశ, వెబ్‌డెస్క్: నటనపై ఇష్టంతో ఎంతో మంది సినిమాల్లో నటించాలనుకుంటారు. కానీ వారి పాలిట ‘కాస్టింగ్ కౌచ్’ శాపంలా మారింది. ఇప్పటికీ అగ్రతారలు సైతం వారికి ఎదురైన చేతు అనుభవాలను వెల్లడించారు. తాజాతా బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సినిమాతో అరేంగేట్రం చేసిన జరీన్ ఖాన్ కూడా తన చేదు అనుభవాన్ని తెలిపారు.

తాను సినిమాల్లోకి రాకముందు ఓ కాల్ సెంటర్‌లో పనిచేసుకుంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో.. ఓ దర్శకుడు పరిచయమయ్యాడని, కొద్దిరోజులకు సదరు దర్శకుడు సినిమాల్లో అవకాశం ఇప్పి్స్తానని చెప్పి.. ఓ సినిమాలో ముద్దు సీన్ ఉంది రిహార్సల్ చేద్దామని… చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. అతను గురించి అర్థమై మెల్లిగా ఆ దర్శకుడి నుండి తప్పించుకున్నానని వెల్లడించింది.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed