Supreme Court: సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చడమేంటి?

by Shamantha N |   ( Updated:2025-04-07 15:05:56.0  )
Supreme Court: సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చడమేంటి?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ పోలీసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చడమేంటి? అని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మసనం ప్రశ్నించింది. సివిల్ కేసుని క్రిమినల్ కేసుగా మార్చడమంటే చట్టబద్ధ పాలనను విచ్ఛిన్నం చేయడమే అని మండిపడింది. భవిష్యత్తులో ఇలాంటి వాటిపై పిటిషన్లు దాఖలైతే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఒక కేసులో క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను కోర్టు నిలిపివేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసు చీఫ్ ప్రశాంత్ కుమార్ సహా దర్యాప్తు అధికారికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా స్పందన దాఖలు చేయాలని కోరింది. అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్‌లోని న్యాయవాదులు సివిల్ అధికార పరిధి గురించి మరచిపోయారని సీజేఐ వ్యాఖ్యానించారు.

చెక్ బౌన్స్ కేసు..

చెక్ బౌన్స్ కేసుకు సంబంధించిన సివిల్ దావాను యూపీ పోలీసులు క్రిమినల్ కేసుగా మార్చారు. ఆ తర్వాత పోలీసులు సమన్లు జారీ చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై పిటిషనర్ కోర్టును ఆశ్రయించాడు. కేసును మార్చడానికి పోలీసులు లంచం తీసుకున్నారని ఆరోపించారు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చే ధోరణి పెరుగుతోంది సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది తప్పు, యుపీలో ఏం జరుగుతోంది. రోజువారీ సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మారుస్తున్నారు. ఇది అసంబద్ధం. డబ్బు ఇవ్వకపోవడాన్ని నేరంగా మార్చలేము” అని సీజేఐ అన్నారు. గతేడాది డిసెంబర్‌లో కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పద్ధతినే ఆచరించారని గుర్తుచేశారు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చడం వల్ల న్యాయవ్యవస్థపై సివిల్ అధికార పరిధి ద్వారా పరిష్కరించగల విషయాల భారం పడుతుందని అన్నారు.

Read More..

బీహార్ ఇకపై మౌనంగా ఉండదు.. ర్యాలీపై రాహుల్ గాంధీ ట్వీట్

Next Story

Most Viewed