ప్రజావాణిలో గృహాల కోసం వచ్చే దరఖాస్తులే అధికం!

by Aamani |
ప్రజావాణిలో గృహాల కోసం వచ్చే దరఖాస్తులే అధికం!
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : ప్రజావాణి కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ కు చెందిన దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో సింహ భాగం దరఖాస్తులు ఇండ్లకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే ఇందులో కొంతమంది ప్రతివారం దరఖాస్తు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రిపీటెడ్ గా ఇండ్ల కోసం ప్రజావాణికి రావద్దని, ఒకసారి చేసిన దరఖాస్తును అధికారులు తప్పనిసరి పరిశీలించి అర్హులైన వారి జాబితా సిద్ధం చేయడం జరుగుతుందని ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఇతర ఉన్నతాధికారులు సూచిస్తున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు.

ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 56 దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో గృహ నిర్మాణ శాఖకు 18, పెన్షన్ 10, ఇతర శాఖలకు సంబంధించినవి 28 ఉన్నాయి. వీటిని పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు .ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. ముకుంద రెడ్డి, డీఆర్ఓ ఈ. వెంకట చారి, ఆర్డిఓ సాయిరాం, జిల్లా అధికారులు పవన్ కుమార్, ఆశన్న సుబ్రహ్మణ్యం,కోటజీ, సురేందర్, రాజేందర్ , శ్రీరామ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed