రైతులకు ఇదేం గోస.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారుగా..

by Kalyani |
రైతులకు ఇదేం గోస.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారుగా..
X

దిశ, ఆలూర్: ఆలూర్ మండల కేంద్రంలో వ్యవసాయ క్షేత్రాల్లో రైతుల వ్యవసాయ బోరు బావులకు సంబంధించిన కేబుల్ వైర్లు, ఫీజులు, స్టార్టర్లను తెలియని దుండగులు ఆదివారం రాత్రి అపహరించుకు వెళ్ళినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలూర్ లో రైతులు నడికుడ గంగారెడ్డి, నడికుడ నర్సారెడ్డి, ముస్కు శ్రీకాంత్, సింగిడి లింగారెడ్డి, నడికుడ రవి వ్యవసాయ బోరుబావుల వద్ద వారి వ్యవసాయ క్షేత్రాల్లో కేబుల్ వైర్లను, స్టార్టర్లను, ఫీజులను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లి అపార నష్టం కలిగించాలని రైతులు లబోదిబోమంటున్నారు. తరచూ గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావుల వద్ద నుంచి స్టార్టర్ డబ్బాలోని వస్తువులతో పాటు, కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లి అపార నష్టం కలిగించడం వల్ల, పంటలకు సైతం నీరు అందించలేక పోతున్నామని రైతులు వారి బాధను మొర పెట్టుకుంటున్నారు. ఈ విషయం పై ఆర్మూర్ పోలీసులు దృష్టి సారించి దుండగులను పట్టుకొని రైతుల బాధలను తీర్చాలని పోలీసులను వేడుకుంటున్నారు.

Next Story

Most Viewed