- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబో ఫిక్స్.. అనౌన్స్‌మెంట్ రాబోతుందంటూ ట్వీట్ వైరల్

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. అలాగే హిట్స్ సాధిస్తూ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్నారు. ఇటీవల ఆయన ‘డాకు మహారాజ్’ సినిమాతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు అదే ఫామ్‌తో ‘అఖండ-2’(Akhanda-2) చేస్తున్నారు. బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ (Samyuktha Menon)హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి(Aadi Pinisetty) విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా 2021లో వచ్చిన సూపర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే దీనిని బాలయ్య కూతురు తేజస్విని నిర్మిస్తోంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్స్‌లో రానుంది. ఇక ఈ చిత్రం విడుదల కాకముందే బాలయ్య మరో ప్రాజెక్ట్ చేయనున్నట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు టాక్. అయితే దీనికి హరీష్ శంకర్ కథ అందిస్తుండగా.. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి మీటింగ్స్ జరుగుతున్నట్లు త్వరలోనే అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు సమాచారం.
#NBK #GopichandMalineni కాంబో ఆల్రెడీ ఫిక్స్ అంటున్నారు.. త్వరలోనే ఎనౌన్స్ మెంట్ ఉండొచ్చు. https://t.co/mLFFDmnJPd
— Rajesh Manne (@rajeshmanne1) April 6, 2025