- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రజనీ స్టేట్‌మెంట్‌పై భారతీ రాజా కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: సూపస్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చేసిన ప్రకటన అభిమానులను కాస్త నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. అనారోగ్య కారణాల వల్ల రాజకీయ పార్టీపై ఇప్పుడే ప్రకటన చేయలేనని, అభిమానులు తనను మన్నించాలని కోరారు. ఈ అనౌన్స్‌మెంట్‌పై స్పందించిన పలువురు సెలెబ్రిటీలు.. తలైవా నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ క్రమంలోనే రజనీ రాజకీయ ప్రకటన సముచితమని, అలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని హ్యాట్సాఫ్ చెప్పారు భారతీ రాజా. గతంలో రజనీ పొలిటికల్ ఎంట్రీపై విభేదించిన తాను.. ‘సినిమాలకు భాష, ప్రాంతం అవసరం లేదని, కానీ రాజకీయానికి ప్రాంతీయత అవసరం’ అనే రజినీ రాజకీయ ప్రవేశంపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలిపారు. తనకు ఆధ్యాత్మికతను, కీర్తి ప్రతిష్టలను దేవుడు ఇప్పటికే ఇచ్చారని మళ్లీ పాలిటిక్స్ అవసరం లేదన్నారు. ఇప్పుడున్న హెల్త్ కండిషన్‌ను బట్టి తను పాలిటిక్స్‌కు రాకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. రజినీ మాకు నీ లైఫ్, నీ ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని.. ఫ్యాన్స్‌కు నువ్వు చాలా ముఖ్యమని చెప్పారు. ఈ విషయంలో అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.