- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. జూన్ 11 నుంచి డిజిటల్ పైలెట్ సర్వే చేపట్టనున్నట్లు, ఈ పైలెట్ ప్రాజెక్టు కోసం 27 గ్రామాలు ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గంలో 3 గ్రామాలు, మిగిలిన జిల్లాల్లో 24 గ్రామాలు ఎంపిక చేసినట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
పట్టదారు భూములకు శాశ్వత రక్షణ చర్యలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఉద్ఘాటించారు. ప్రజల భూ హక్కులు కాపాడేందుకే డిజిటల్ సర్వే చేస్తున్నామని, ముందుగా వ్యవసాయ భూములు, తర్వాత పట్టణ భూములు సర్వే చేస్తామన్నారు. పైలెట్ సర్వే తర్వాత పూర్తి సర్వేకు విధివిధానాలు సిద్ధం చేస్తామని, అవాంతరాలను అధిగమించి ధరణి పోర్టల్ అద్భుతంగా పనిచేస్తోందన్నారు.
Advertisement
Next Story