- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో సాగు భూములకు డిజిటల్ హద్దులు
దిశ, తెలంగాణ బ్యూరో: రైతుల ఆధీనంలోని భూములకు డిజిటల్ హద్దులను అందించాలని తెలంగాణ కేబినేట్ నిర్ణయించింది. భౌతికంగా ఉండే హద్దు రాళ్లు, కాగితాల మీద టిప్పన్ నక్షతో కూడిన కొలతలను, అదే లెక్కలు, అవే హద్దులను డిజిటల్ రూపంలో మారుస్తారు. హద్దు రాళ్లు తొలగిపోయినా, ఊడిపోయినా, కొలతల కాగితాలు చిరిగిపోయినా రైతుల భూములకు ఇంచు తేడా రాకుండా డిజిటల్ మ్యాప్ ద్వారా రక్షణ లభిస్తుందని రెవెన్యూ శాఖ కేబినేట్ కు వివరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయం భూములకు వాటి కొలతల ప్రకారం డిజిటల్ సర్వే చేపట్టి వాటికి అక్షాంశ, రేఖాంశాలను (కో ఆర్డినేట్స్ ) ను నిర్దారించాలని తీర్మానించారు. అందుకు సంబంధించి పాత ఉమ్మడి 9 జిల్లాల్లో జిల్లాకు మూడు గ్రామాల వంతున 27 గ్రామాల్లో సర్వేను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. వ్యవసాయ భూముల సెటిల్ మెంట్ అనే వ్యవహారమే ఉత్పన్నం కాదని తెలిపింది. ఇప్పటికే సమస్యలేవీ లేకుండా పరిష్కారమైన ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ఆర్వోఆర్ చట్టం- 2020 ప్రకారం రాష్ట్రంలోని 99 శాతం వ్యవసాయ భూములు ఎటువంటి సమస్యలు లేకుండా ధరణిలో నమోదైనట్లు కేబినెట్ కు రెవెన్యూ శాఖ వివరించింది.