- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ కరెన్సీలో ‘జీరో’ నోటు.. మీకు తెలుసా?
దిశ, ఫీచర్స్ : ఇండియాలో కరెన్సీ నోట్లు రూ.10 నుంచి రూ. 2000 వరకు ఉంటాయని తెలిసిందే. గతంలో అయితే రూ. 1, 2 & 5 రూపాయల నోట్లు కూడా ఉండేవి. కానీ వీటితో పాటు ‘జీరో’ నోటు ఉందన్న విషయం చాలామందికి తెలియదు. అవును.. మీరు విన్నది నిజమే! ఇండియన్ కరెన్సీలో ఒక దశాబ్ద కాలం నుంచి సున్నా రూపాయి నోటు కూడా ఉండేది. అయితే ఆర్‌బీఐ ముద్రించే నోట్ల మాదిరి కాకుండా కొంచెం భిన్నంగా ఉండే ఈ నోట్లు ప్రత్యేక ప్రయోజనం కోసం ఉద్దేశించబడ్డాయి. అదేంటో మీరూ తెలుసుకోండి.
జీరో నోటు లక్ష్యం..
ఇండియాలో వివిధ రూపాల్లో అవినీతి కొనసాగుతున్న విషయాన్ని కాదనలేం. ప్రత్యేకించి లంచాలు ఇచ్చే సంస్కృతి సమాజంలో ఓ భాగమైపోయింది. అయితే కష్టపడి సంపాదించిన డబ్బును లంచంగా ఇవ్వాల్సి రావడం బాధితులకు బాధాకరం కాగా.. అవినీతి అధికారులను ట్రోల్ చేసేందుకు ప్రత్యేకంగా ‘జీరో నోటు’ తయారు చేయాలనే ఆలోచన పుట్టింది. ఈ క్రమంలోనే ‘ఫిఫ్త్ పిల్లర్’ అనే ఎన్జీవో 2007లో ఈ నోటును ప్రవేశపెట్టింది. నోటు వెనుకవైపు అధికారుల కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండగా.. ఏ రూపంలోనైనా లంచాన్ని అరికట్టడమే ఈ నోటు ఉద్దేశ్యం. ఎవరైనా అధికారులు లంచం అడిగినప్పుడు పౌరులు ఈ సున్నా రూపాయి నోటును ‘చెల్లించాలని’ ప్రోత్సహిస్తోంది.
తమిళనాడుకు చెందిన ఈ NGO.. వాస్తవానికి హిందీ, తెలుగు, కన్నడంతో పాటు మలయాళం వంటి వివిధ భాషల్లో మిలియన్ల కొద్దీ ఈ నోట్లను ముద్రించింది. దీనిపై అవగాహన పెంచేందుకు సదరు ఎన్జీవో వాలంటీర్లు.. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మార్కెట్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఈ నోట్లను పంపిణీ చేస్తారు. లంచం, అవినీతిని నిర్మూలించే ప్రాథమిక లక్ష్యాన్ని ఈ నోటు ద్వారా తెలియజేస్తారు. కాగా ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే, ఈ నోటు ఇచ్చి కేసు రిపోర్ట్ చేయొచ్చనే కొటేషన్ నోటుపైనే ముద్రించి ఉండటం విశేషం.