‘అంపైర్‌తోనే Kings XI Punjab ఓటమి’

by Anukaran |
‘అంపైర్‌తోనే Kings XI Punjab ఓటమి’
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ (IPL) 13వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల నిర్లక్ష్యంపై విమర్శలు చెలరేగుతున్నాయి. పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ (89) చివరి వరకు పోరాడినా, సూపర్ ఓవర్‌లో ఢిల్లీ జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్ తీసుకున్న తప్పుడు నిర్ణయంపై మాజీ క్రికెటర్లు, అభిమానులు మండి పడుతున్నారు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ మూడో బంతికి మయాంక్ అగర్వాల్ రెండు పరుగులు తీశాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న జోర్డాన్ షార్ట్ రన్ తీశాడని అంపైర్ నితిన్ మీనన్ ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు

టీవీ రిప్లేలో మాత్రం అతను లైన్‌మీదనే బ్యాట్ పెట్టినట్లు స్పష్టమైంది. ఈ పరుగే ఆ జట్టు చేసి ఉంటే పంజాబ్ సూపర్ ఓవర్ అవసరం లేకుండానే గెలిచేది. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..’‘అంపైర్ తీసుకున్న నిర్ణయంతో నేను ఏకీభవించడం లేదు. షార్ట్ రన్‌ ఇచ్చిన ఇతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలి. అది షార్ట్ రన్ కానే కాదు’ అని ట్వీట్ చేశాడు. అంపైర్ నిర్ణయంపై ఇర్ఫాన్ పఠాన్, పంజాబ్ సహ యజమాని ప్రీతీ జింటా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed