- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వజ్రాల మాస్కులు.. అక్కడ స్పెషల్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ అంటే చాలు జనాలు వణికిపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసే క్రమంలో మాస్క్ కీలకం. దీంతో ఇంట్లో నుంచి ఎవరు బయటకి వచ్చినా మాస్క్ తప్పనిసరిగా ధరిస్తున్నారు. ప్రస్తుతం మాస్క్‌కు డిమాండ్ పెరగడమే కాకుండా.. అత్యవసరమైంది. దీంతో చాలా రకాల మాస్క్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి బంగారు మాస్క్ ధరించి అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా వార్తల్లో కూడా నిలిచాడు.
ఈ నేపథ్యంలో ఒకరితో ఒకరు పోటీగా మాస్కులు తయారు చేయడంలో చొరవ చూపుతున్నారు. తమ స్థాయికి తగినట్లుగా మాస్కులు ధరించడంలో పలువురు ఆసక్తి చూపుతుండడంతో.. వ్యాపారులు చాలా వెరైటీల్లో మాస్కులు రూపొందిస్తున్నారు. ఇక గుజరాత్‌లో అయితే ఏకంగా వజ్రాలతో మాస్కులు తయారు చేయడం గమనార్హం. సూరత్ నగరంలో లక్షల రూపాయల విలువగల వజ్రాలతో ఏకంగా కరోనా మాస్కులను తయారు చేస్తున్నారు. ధర ఎంత ఉన్నా వెనకఅడుగు వేయకుండ అక్కడి వారు కొనుగోళ్లు చేస్తున్నారంటే ఆశ్చర్యకరం. ఇందులో అధిక శాతంలో అమ్మాయిలు ఈ మాస్కులను ధరిస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వజ్రా వ్యాపారులకు లాభం చేకూరడమే కాకుండా.. ఆర్ధర్లు కూడా అధిక మొత్తంలో వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.