ఆభరణాల అమ్మకాల్లో 85 శాతం రికవరీ!

by Harish |
ఆభరణాల అమ్మకాల్లో 85 శాతం రికవరీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంబంధిత అంతరాయాల కారణంగా జూన్ త్రైమాసికంలో వ్యాపారం పూర్తిగా నిలిచిపోయినప్పటికీ, వజ్రాల ఆభరణాల వ్యాపారం అక్టోబర్ నుంచి బాగా కోలుకున్నాయి. అంతేకాకుండా పరిశ్రమ గతేడాది అమ్మకాల్లో 70-85 శాతం అమ్మకాలను సాధించగలదని డిబీర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సచిన్ జైన్ చెప్పారు. ‘2019 నాటి అమ్మకాల్లో 85 శాతం వరకు వ్యాపారాలను తిరిగి దక్కించుకోగలమనే ఖచ్చితంగా చెప్పగలను. గతేడాది స్థాయిని చేరుకోకపోయినప్పటికీ వీలైనంత తొందరగా దాన్ని తిరిగి సాధించగలమని’ సచిన్ తెలిపారు.

లాక్‌డౌన్ లాంటి క్లిష్ట సమయాల్లో వినియోగదారులతో వ్యాపారాలు ఎలాంటి ధోరణిని అవలంభించాయో దానిపై ఆధారపడి రికవరీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ అక్టోబర్ నుంచి పండుగ సీజన్ మొదలవడంతో కార్యకలాపాలు పుంజుకున్నాయని, ఫలితంగా డిమాండ్ పెరిగిందని సచిన్ జైన్ పేర్కొన్నారు. వినియోగదారులు సాధారణ కొనుగోళ్లతో పాటు అధిక డిమాండ్ నేపథ్యంలోనూ కొనుగోళ్లు జరిగాయి. ఇదే సమయంలో వివాహాల సమయాల్లో వినియోగదారుల విధానంలో గణనీయమైన మార్పులను గమనించామని ఆయన వెల్లడించారు. ప్రయాణ ఆంక్షలు, వివాహం లాంటి వేడుకల్లో ఎక్కువ మందికి అనుమతి లేని కారణంగా వినియోగదారులు ఆ ఖర్చును ఆభరణాల కోసం ఉపయోగిస్తున్నట్టు గమనించామని చెప్పారు.

Advertisement

Next Story