- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీ Vs మహీ.. వరల్డ్ కప్ ప్రత్యేక ఇంటర్వ్యూ
దిశ, స్పోర్ట్స్ :’నాకు నేనే పోటి’ అంటూ టాలీవుడ్‌లో ఒక డైలాగ్ ఉంటుంది. అలాగే టీమ్ ఇండియా చరిత్రలో అలాంటి వ్యక్తి ఎంఎస్ ధోని. ఇంత వరకు ఎవరూ సాధించని ఘనతలు అతడు సాధించి చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోనీకి ప్రత్యేక స్థానం ఉన్నది. టీమ్ ఇండియా ధోనీ నాయకత్వంలో వన్డే వరల్డ్ కప్ గెలిచి శుక్రవారానికి దశాబ్దం గడిచింది.
ఈ సందర్భంగా అతడితో ‘గల్ఫ్ ఆయిల్’ సౌజన్యంతో ‘ఇన్‌సైడ్ స్పోర్ట్’ ఒక ప్రత్యేక ఇంటర్యూ చేసింది. అందులో అనేక విషయాలు పంచుకున్నాడు. ఇందులో ధోనీని ధోనీనే ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ ప్రత్యేక వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నది. 2011లో ప్రపంచ కప్ గెలిచిన వివరాలను ధోనీ వివరిస్తుండగా సాగిన సంభాషణ వీక్షకులకు నవ్వు తెప్పించింది. మరో వైపు తనకు బటర్ చికెటన్, కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్‌లు అంటే ఇష్టమని జూనియర్ ధోనీ చెప్పగా.. అవన్నీ మానేయమని సీనియర్ ధోనీ చెప్పడం ఆసక్తి కలిగించింది.