- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోని వల్లే ఫిట్‌నెస్ క్యాంపు ఏర్పాటు
దిశ, స్పోర్ట్స్ : చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఐపీఎల్(IPL) కోసం దుబాయ్ ప్రయాణించడానికి ముందు చెన్నైలోని చేపాక్ స్టేడియంలో తమ ఆటగాళ్ల కోసం ఫిట్‌నెస్ క్యాంప్ నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల రవీంద్ర జడేజా, హర్బజన్ సింగ్, విదేశీ ఆటగాళ్లు తప్ప మిగతా అందరూ ఈ క్యాంపులో పాల్గొన్నారు. అయితే, కెప్టెన్ ధోని పట్టుబట్టడం వల్లే ఈ ఫిట్‌నెస్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.
లాక్‌డౌన్ కారణంగా చాలా రోజులు ఆటగాళ్లందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఏ ఆటగాడు కూడా కనీసం బ్యాట్ పట్టలేదు. అయితే ఒకేసారి క్రికెట్ ప్రాక్టీస్ చేయడం శరీరానికి అంత మంచిది కాదని భావించిన ధోని కావాలనే ఐదు రోజుల ఫిట్‌నెస్ క్యాంప్ ఏర్పాటు చేయించాడట. సీఎస్కే (CSK) జట్టు సభ్యుడు చాహర్ మాట్లాడుతూ ‘5 నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్నాము. ఇప్పుడు ఫిట్‌నెస్ శిబిరంలో పాల్గొన్న అనంతరం మేం శారీరికంగానే కాకుండా మానసికంగా క్రికెట్‌కు సిద్ధపడ్డాము. ఇది మాకు ఎంతగానో సహకరించింది’ అని అన్నాడు. దుబాయ్ వెళ్లాక ఏర్పాటు చేద్దామని సీఈవో కాశీ విశ్వనాథన్ కెప్టెన్ ధోనికి చెప్పారు. ఇప్పుడు చెన్నైలో బయోబబుల్ ఏర్పాటు చేయాలంటే కష్టం అని కూడా చెప్పానని.. కానీ ధోని పట్టుబట్టడంతో కాదనలేక పోయినట్లు ఆయన చెప్పారు.