- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
టాలెంట్ ఎవరి సొత్తూ కాదు.. లారీ డ్రైవర్ కూతురు ‘ఢీ-13’ విన్నర్
దిశ, తాండూరు : తాండూరు పట్టణంలోని నిరుపేద కుటుంబంలో జన్మించిన కావ్య చిన్నతనం నుండి డ్యాన్స్‌పై మమకారం పెంచుకుంటూ ఇతరులను చూసి తాను కూడా గొప్ప డ్యాన్సర్ కావాలని కలలు కన్నది. ఈ టీవీలో వచ్చే డ్యాన్స్ ప్రోగ్రాంలు చూస్తూ తాను కూడా డ్యాన్సర్ కావాలనుకుంది. ఆ కలలను నిజం చేసుకోవాలని తాండూర్‌లోని ప్రముఖ డ్యాన్స్ మాస్టర్‌లతో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంలో తన ప్రతిభను గుర్తించిన డ్యాన్స్ మాస్టర్లు ఢీ-13 సెలక్షన్స్‌లోకి పంపడంతో తన ప్రతిభను నిరూపించుకుని విజేతగా నిలవడం తాండూర్ ప్రజల గర్వకారణం అంటూ పలువురు పేర్కొన్నారు. విజేత కావ్య తాండూరు పట్టణంలోని భాష్యం కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్య అభ్యసిస్తోంది.
ఈ సందర్భంగా విజేత కావ్య మాట్లాడుతూ.. ఎంతో అట్టడుగు స్థాయి నుంచి వచ్చానని తన తండ్రి సామాన్య లారీ డ్రైవర్ అని చెప్పింది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, డ్యాన్స్ నేర్పించిన గురువుల ఆశీస్సులతోనే తాను ఢీ-13 టైటిల్ గెలవడం జరిగిందని తెలిపారు. అలాగే రాబోయే సీజన్ ఢీ-14 సెలక్షన్‌లో కూడా తాను సెలెక్ట్ అయినట్టు ఈ సందర్భంగా వెల్లడించింది. ఢీ ఫైనల్‌కు స్పెషల్ గెస్టుగా వచ్చిన స్టార్ హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా టైటిల్‌ను అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది.