అన్యాయం జరిగిందని.. ప్రైవేటు టీచర్ల ధర్నా

by Sridhar Babu |
అన్యాయం జరిగిందని.. ప్రైవేటు టీచర్ల ధర్నా
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకునేందుకు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా యాజమాన్యలు సహకరించలేదని టీపీటీఎఫ్ ఆరోపించింది. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ముందు ప్రైవేటు ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ… తమకు అన్యాయం చేసే విధంగా యాజమాన్యాలు జాబితాలు ఇచ్చాయని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని, బియ్యాన్ని తమకు అందకుండా తప్పుడు రిపోర్టులు పంపించాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు చొరవ తీసుకుని ఆయా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న తమకు ప్రభుత్వ సాయం అందించాలని కోరారు.

Advertisement

Next Story