సిద్దిపేటలో కార్మికుల ధర్నా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

by Shyam |   ( Updated:2021-08-12 04:21:51.0  )
సిద్దిపేటలో కార్మికుల ధర్నా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
X

దిశ, సిద్దిపేట: పెండింగ్ వేతనాలు కోసం అవుట్ సోర్సింగ్ కార్మికుల ధర్నా చేపట్టారు. ప్రాణాంతకమైన కరోనా వ్యాధి‌ని సైతం లెక్కచేయకుండా రోగులకు అన్ని రకాల సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న.. అన్ని విభాగాల కార్మికులకు, ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయలాని వారు డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఉద్యోగ భద్రతను కల్పించాలని వారు కోరుతున్నారు. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు 15 వేల 600 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వ వైద్య కళాశాల కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేస్తూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి కాంట్రాక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వారు మాట్లాడుతూ… కరోనా పేషెంట్ అడ్మిట్ చేసుకోవడానికి పెద్దపెద్ద ప్రైవేట్ హాస్పిటల్‌లో సైతం వెనకాడుతున్నా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే వారికి వైద్య సేవలు అందాయని అన్నారు. సిద్దిపేట జనరల్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అరకొర వేతనాలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. సుమారు ఎనిమిది నెలల నుండి వేతనాలు కాంట్రాక్టర్ చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పదకొండవ పీఆర్‌సీ‌తో వచ్చిన జీవో నెంబర్ 6 ప్రకారం కనీస వేతనం 15600 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు ధర్నా చేయడంతో ఆసుపత్రి సూపరిటెండెంట్ సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.

Advertisement

Next Story

Most Viewed