- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్ వీడియోలు చూస్తోన్న RDO.. కలెక్టరేట్ ఎదుట DSP ధర్నా
దిశ, బోథ్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూమిలో పార్కు నిర్మాణం ఆపాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట డీఎస్పీ ఆధ్వర్యంలో బాధితులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కాగా, వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన డీఎస్పీ నాయకులను పట్టించుకోకుండా, ఆర్డీవో యూట్యూబ్ వీడియోలు చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. కజ్జర్ల గ్రామంలో సర్వే నెంబర్ 142లో ఖాళీ స్థలం బాగానే ఉందని, అయినా పేదలకు కేటాయించిన భూమిలోనే పార్కు నిర్మాణం చేస్తున్నారని వాపోయారు. దీనిపై స్పందించాలని ఆర్డీవోను కోరగా, ‘‘మాకేం సంబంధం లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి’’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని అన్నారు.
ఇలాంటి నిర్లక్ష్య అధికారులు, అధికార పార్టీ నాయకుల వల్లనే జిల్లాలోని పేదల భూముల్లో ప్రభుత్వ పార్కులు, శ్మశానాలు కడుతూ పేదలను, దళితులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్య పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో డీఎస్పీ జిల్లా కార్యదర్శి రమేష్, తలమడుగు, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఆదిలాబాద్ అర్బన్, రూరల్, జైనథ్, మండలాల డీఎస్పీ అధ్యక్షులు రాంచందర్, శేఖర్, రాజేశ్వర్, సంతోష్, లక్ష్మణ్, గంగన్నతో పాటు వివిధ మండలాల డీఎస్పీ నాయకులు అమూల్, విజయ్, రాజీవ్, పోచన్న, సంజీవ్, దివాకర్ పాల్గొన్నారు.