ఎమ్మెల్యే భర్త వేధిస్తున్నారు.. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్న

by Sridhar Babu |
ఎమ్మెల్యే భర్త వేధిస్తున్నారు.. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్న
X

దిశ టేకులపల్లి : గోల్యతండా పంచాయితీ సర్పంచ్‌ను అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్భంధించారని టేకులపల్లి పోలీస్టేషన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ సర్పంచ్‌లు బొడ నిరోషా, కోయగూడెం సర్పంచ్ పునెం ఉమా, గోల్యాతండా గ్రామస్తులు టేకులపల్లి సీఐ బానోత్ రాజు అక్రమ కేసులు పెడుతున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

వివరాల్లోకి వెళ్లితే.. ఇల్లందు ఎమ్మెల్యే భర్త పంచాయతీలో, కోయగూడెం ఓసీలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తన అనుచరులతో వేధిస్తున్నారని గోల్యాతండా సర్పంచ్ భర్త బొడ మంగీలాల్ ఆరోపించారు. టేకులపల్లి ఎస్ఐ కోయగూడెం ఓసి కాంట్రాక్టర్, ఎమ్మెల్యే అనుచరులు అక్రమ కేసులు పెట్టిస్తున్నారని తెలిపారు. ఇటీవలే ఎమ్మెల్యే అనుచరుడి ఇల్లు ఎక్కి ఓ చిన్నారి కరెంట్ షాక్‌తో చేతులు కోల్పోయింది. తన అనుచరుడి ఎమ్మెల్యే నూతన బిల్డింగ్ పై నుంచి 11కేవీ వైర్లు, హరితహారం మొక్కలు తొలగిస్తుంటే పంచాయతీలో తెలుపకుండా తొలగిస్తారా అని ప్రశ్నించినందుకు అక్రమ కేసులతో బనాయిస్తున్నారని సర్పంచ్ భర్త అన్నారు. ఈ విషయం పై టేకులపల్లి సీఐ బానోత్ రాజును వివరణ కోరగా తనకు గోల్యాతండా సర్పంచ్ భర్తను స్టేషన్ కి తీసుకొచ్చిన విషయం తెలియదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed