- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, గద్వాల: దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్సి సమగ్ర అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంఆర్పిఎస్ నాయకులు జిల్లా అధ్యక్షుడు ఐజ రాజు, జిల్లా ఇంచార్జ్ మస్తాన్ మాదిగ, జాతీయ నాయకులు కొంకల భీమన్న మాదిగ, బుడగ జంగాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఇచ్చిన దళిత బంధు కేవలం ఎలక్షన్‌లో దళిత ఓట్ల కోసమే తప్ప మరొకటి లేదని, నిజంగా కేసీఆర్ ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే ఇట్టి పథకాన్ని హుజురాబాద్ దళితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి దళిత కుటుంబానికి అందించాలని డిమాండ్ చేశారు.
లేదంటే హుజురాబాద్ లో సెప్టెంబర్ 5న భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ దళితులను మోసం చేసిన విషయాన్ని బయట పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు డీకే సుందర్ రాజు మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి అశోక్ మాదిగ, బుడగ జంగాల జిల్లా అధ్యక్షులు సిరిగిరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.