ధరణి ఆన్‌లైన్ సేవలు బంద్..

by Sridhar Babu |
Dharani
X

దిశ, ఖమ్మం రూరల్​ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూముల ఫీజులు పెంచేందుకు ధరణి ఆన్‌లైన్​ సేవలను ఒక్కసారిగా మంగళవారం మధ్యాహ్నం నుంచి నిలిపివేసింది. దీంతో, భూ సంబంధిత రిజిస్ట్రార్​ఆఫీసర్, తహసీల్దార్ ​కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్‌లు చేసుకునేందుకు వచ్చిన వినియోగదారులకు నిరాశే మిగిలింది.

అయితే, ధరణిలో చలాన్ ​చెల్లించి, స్లాట్​బుక్ చేసుకున్న వారికి వేసులుబాటు కల్పించే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూ విలువలు పేంచేందుకు జీవోను సైతం జారీ చేసినట్లు తెలిసింది. ఇంటి స్థలాలకు 30 శాతం నుంచి 50 శాతం, వ్యవసాయ భూములకు 30 శాతం నుంచి 150 శాతం వరకు మార్కెట్​ విలువలను పెంచేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు గత్యంతరం లేకనే భూ విలువలను పెంచుతున్నట్లు పలువురు విశ్లేషకులు పేర్కొనడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed