- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అతనో ఆటో డ్రైవర్.. ధనుష్‌పై బాడీ షేమింగ్ ట్రోల్స్

దిశ, సినిమా : అతిచిన్న వయసులో ఉత్తమ నటుడిగా రెండు నేషనల్ అవార్డులు గెలుచుకున్న నటుడిగా రికార్డు సృష్టించాడు హీరో ధనుష్. ‘ఆడుకాలమ్’ సినిమాకు తొలి జాతీయ అవార్డు అందుకున్న ధనుష్.. ‘అసురన్’ చిత్రంలో నటనకు గాను మరోసారి నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇంత టాలెంట్ ఉన్న హీరోను చూసి, తను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఎంత మంది నవ్వుకున్నారు? బాడీ షేమింగ్ గురించి మాట్లాడి ఎలా ఏడిపించారు? అనే విషయాలపై ధనుష్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘కాదల్ కొండె’ సినిమా ద్వారా 15 ఏళ్లకే హీరోగా పరిచయమైన ధనుష్.. ఆ మూవీ సెట్స్‌లో హీరో ఎవరు? అని అడిగారని చెప్పాడు. దీంతో మరిన్ని అవమానాలు ఎదుర్కోవడం ఇష్టంలేని తను సెకండ్ హీరోగా ఉన్న మరో వ్యక్తి వైపు చూపించి తనే హీరో అని చెప్పానని తెలిపాడు. కానీ కాసేపు డిస్కషన్ తర్వాత హీరో తనే అని అందరికీ అర్థమైందని, దీంతో సెట్‌లో ఉన్న ప్రతీ ఒక్కరు ‘హే ఆటో డ్రైవర్, అతడే హీరో’ అంటూ నవ్వేశారని, దీంతో కారు దగ్గరకు వెళ్లి ఏడ్చానని చెప్పాడు ధనుష్. కానీ అదే సమయంలో ఆటో డ్రైవర్ హీరోగా ఎందుకు ఉండకూడదనే ప్రశ్న తనలో రెయిజ్ అయిందన్నాడు ధనుష్. టాలెంట్ ఉన్న ఎవరైనా హీరోనే.. కటౌట్ చూసి కామెంట్ చేయడం సరికాదని తెలిపాడు.