- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ ఇంటివాడైన యజువేంద్ర చాహల్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చిన టీమ్ ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అందరికీ ఒక షాక్ ఇచ్చాడు. కొరియోగ్రాఫర్, యూట్యూబర్ అయిన ధనశ్రీని మంగళవారం పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బంధువులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను ధనశ్రీ, చాహల్ వేర్వేరుగా షేర్ చేశారు. కానీ ఇద్దరూ ఒకటే సందేశాన్ని జత చేశారు. ‘22.12.20.. అనగనగా ఒక రోజు దగ్గర ప్రారంభమైన మా జీవితం చివరకు ‘కలకాలం సంతోషంగా ఉంటాము’ అనే దగ్గరకు చేరుకున్నాము. మేమిద్దరం ఒకటయ్యాము’ అని పోస్ట్ చేశారు.
లాక్డౌన్ సమయంలోనే వీరిద్దరికీ నిశ్చితార్దం జరిగింది. చాహల్ ఆ తర్వాత ఐపీఎల్‌కు వెళ్లాడు. అటునుంచి అటే ఆసీస్ పర్యటన ముగించుకొని గత వారమే ఇండియాకు తిరిగి వచ్చాడు. రాగానే తన ప్రియురాలిని పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. కొత్త జంటకు పలువురు క్రికెటర్లు, అభిమానులు అభినందనలు తెలిపారు. క్రిస్ గేల్, కరణ్ శర్మ, రోహిత్ శర్మ భార్య రితిక, సెలెబ్రిటీలు కిశ్వర్ మర్చంట్, కరన్ వాహీ, బాలరాజ్ సయాల్, ప్రిన్స్ నరూలాతదితరులు శుభాకాంక్షలు అందించారు.