శాంతి భద్రతల పర్యవేక్షణ మీదే : డీజీపీ

by Sumithra |
శాంతి భద్రతల పర్యవేక్షణ మీదే : డీజీపీ
X

దిశ, క్రైమ్ బ్యూరో : రైతాంగ సమస్యలపై పలు పార్టీలు మంగళవారం చేపట్టనున్న భారత్ బంద్ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భారత్ బంద్ నేపథ్యంలో కమిషనర్లు, ఎస్పీలతో మహేందర్ రెడ్డి సోమవారం రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజానీకానికి ఏ విధమైన ఇబ్బందులు, అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసులకు ఏవిధమైన అంతరాయం కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హింసాయుత చర్యలు జరగకుండా అప్రమత్తతతో ఉండాలని, శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాధాన్యత నివ్వాలని మహేందర్ రెడ్డి అధికారులకు సూచించారు.

Advertisement

Next Story