కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారు.. దాని వెనకున్న రహస్యమేంటి?

by sudharani |   ( Updated:2022-08-16 14:04:48.0  )
కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారు.. దాని వెనకున్న రహస్యమేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయులు అత్యంత సంబురంగా జరుపుకునే పండుగ కృష్ణాష్టమి. ఈ పండుగ స్పెషల్ ఉట్లు కొట్టడం. ఈ ఉట్టిని కొట్టడానికి యువతీ యువకులు పోటిపడి మరీ కొడతారు. రంగులను, పూలను చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను నిర్వహించడం పూర్వీకుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఉట్టి కొట్టిన వాళ్లకు గిఫ్ట్స్ కూడా ఇచ్చి ఆనందింపజేస్తారు. అయితే కృష్ణాష్టమి రోజు అసలు ఉట్టి ఎందుకు కొడతారో మనలో చాలా మందికి తెలియదు. దాని వెనుక ఉన్న రహస్యం ధర్మ సందేహంగా ఉంటుంది. అసలు ఉట్టి ఎందుకు కొడతారో ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీకృష్ణుడు చిన్న తనంలో తన చిలిపి చేష్టలు, అల్లర్లతో పలువురి ఇళ్లలోకి ప్రవేశించి పాలు, వెన్న, పెరుగు దొంగతనం చేసేవాడు. అయితే ఆ రోజుల్లో చిన్ని కృష్ణుని ఆగడాల నుంచి తప్పించుకునేందుకు వారు తమ పాలు, పెరుగు, వెన్నను ఓ కుండలో దాచిపెట్టి ఉట్టిలో పెట్టేవారు. అప్పుడు చిన్ని కృష్ణుడు తమ స్నేహితులను ఒంగోబెట్టి వారి సహాయంతో వాటిని దొంగతనం చేసి తినేవాడు. అందుకనే శ్రీకృష్ణుడి చిలిపి చేష్టాలు గుర్తుకు వచ్చేలా.. కృష్ణుడి అల్లరిని ఈ తరం వారికి తెలియజేసేలా కృష్ణుని జన్మదినం రోజు ఉట్లు పగలగొట్టి సంతోషిస్తుంటారు. ఇది ఉట్ల పండుగ వెనుకున్న రహస్యం.

మోహినీయాట్టంతో అబ్బుర పరిచిన లాస్యధృత విద్యార్థులు


Advertisement

Next Story

Most Viewed