- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు పెట్టాడు.. ? దాని వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోండి..
దిశ, ఫీచర్స్ : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని కంఖాల్ గ్రామంలో దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఇదే దేవాలయంలో దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. ఈ మహాయజ్ఞాన్ని దేవతలు, ఋషులు, సాధువులందరినీ ఆహ్వానించారు. కానీ శంకరుడిని ఆహ్వానించలేదు. దక్షుడు శివునికి చేసిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞ అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది. ఈ విషయం తెలుసుకున్న మహాదేవుడు కోపంతో దక్షుని తల నరికేశాడు. దేవతల అభ్యర్థన పై, శివుడు దక్షరాజుకు ప్రాణం పోసి మేక తలని అతికించాడు. దీని తర్వాత దక్షుడు తన తప్పులను గ్రహించి, శివుడిని క్షమించమని కోరతాడు.
పురాణాల ప్రకారం దక్షప్రజాపతి సతీదేవికి తండ్రి, సతికి తండ్రి అయినందున అతను శివుడికి మామగారు కూడా. శివునితో సతీదేవి వివాహం దక్షుడికి ఇష్టం లేకుండా జరుగుతుంది. ఆ వివాహం తర్వాత ఆమెతో తన సంబంధాలన్ని ముగించాడు దక్షుడు. ఒకానొక సమయంలో సతిదేవి, భోలేనాథుడు కైలాషంలో కూర్చున్నారు. అప్పుడే దక్షుడు తన రాజభవనంలో ఒక యాగం నిర్వహిస్తున్నాడని సమాచారం అందింది. ఆ యాగానికి దేవతలు, యక్షులు, గంధర్వులు మొదలైన వారందరూ ఆహ్వానితులయ్యారు.
తనకు ఆహ్వానం అందకపోవడంతో తల్లి సతీదేవి కాస్త బాధపడింది. తన తండ్రి చేసే యాగానికి ఆహ్వానం లేకుండానే వెళతాను అని శివునికి చెప్పింది. అయినా భోలేనాథుడు ఒప్పుకోడు. అయినా సతీదేవి దక్షుడు చేసే యాగానికి వెళుతుంది. అక్కడికి వెళ్లి చూడగా, విష్ణువు, బ్రహ్మతో సహా దేవతలందరికి ఆసనాలు వేసి ఉన్నాయి. కానీ ఎక్కడా శివుడి పేరు లేదు. అంతే కాదు దక్షరాజు సతిపట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు. దీంతో కోపోద్రిక్తురాలైన సతీదేవి హవన్ కుండ్‌లోకి దూకి ప్రాణత్యాగం చేసింది.
శివుని కోపం..
ఈ విషయం తెలుసుకున్న శివుని కోపానికి అవధులు లేకుండా పోయింది. సతీదేవి కాలిపోయిన శరీరాన్ని చూసి, శివునికోపం అగ్నిపర్వతంలా ఉబికింది. ఆ కోపంలో శివుడు దక్షరాజు తలను నరికివేశాడు. అయినా శివుని కోపం చల్లారలేదు. అతను సతీదేవి కాలిన మృత దేహాన్ని మోస్తూ ప్రయాణించడం ప్రారంభించాడు.
ఇదంతా చూసిన శ్రీ హరి తన సుదర్శన చక్రాన్ని వదిలాడు. సుదర్శనుడు సతీదేవి శరీర భాగాలను ఒక్కొక్కటిగా కత్తిరించడం ప్రారంభించాడు. ఆ క్రమంలోనే సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన 52 ప్రదేశాలలో, 52 శక్తిపీఠాలు వెలిశాయి. అవి నేటికీ ప్రధాన విశ్వాస కేంద్రాలుగా ఉన్నాయి.
దక్షుడికి మేక తల..
ఆ తర్వాత దేవతల ప్రార్థన కారణంగా భోలేనాథుని కోపం తగ్గింది. బ్రహ్మదేవుడు శివుని వద్దకు వచ్చాడు. బ్రహ్మదేవుడు మొదట శివునికి సతీదేవి పునర్జన్మ గురించి చెప్పి ప్రసన్నం చేసుకొని తన కుమారుడైన దక్షుని ప్రాణం కోసం వేడుకున్నాడు. తర్వాత భోలేనాథ్ దక్షుని తల స్థానంలో మేక తల పెట్టి ప్రజాపతి దక్షుడికి ప్రాణం పోశాడు.
మేక తలను ఎందుకు పెట్టాడు.. ?
శివుడు తన అనుచరుడితో ఒక మేక తలను నరికి తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మేకతల ఎందుకు అని అడిగారు. ఏనుగు, సింహం, ఏదైనా కావాలని అడిగారు. నందీశ్వరుడు దక్షుడిని వచ్చే జన్మలో మేకగా అవుతాడని శపించాడని శివుడు చెప్పాడు. అప్పుడే ఒక మేక తలను శివుని అనుచరుడు తీసుకురావడంతో దానిని దక్షుని శరీరానికి అతికించి తిరిగి బ్రతికించారు. దీని తర్వాత దక్షుడు శివుడిని స్తుతించి క్షమాపణలు కోరాడు.
- Tags
- Lord Shiva
- Daksha