- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం.. అర్జునుడితో ఆలయానికి సంబంధం ఏమిటి ?
దిశ, ఫీచర్స్ : హిందూమతంలోని త్రిమూర్తులలో శివుడు ఒకరు. భోలేనాథ్‌ని దేవతల దేవుడు అని కూడా అంటారు. భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు అనేక శివాలయాలు కనిపిస్తాయి. ఈ శివాలయాల్లో కూడా అత్యంత ఎత్తైన శివాలయం ఉంది. ఇంతకీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఎక్కడ ఉంది అంటే అది ఉత్తరాఖండ్‌లోని తుంగనాథ్ ఆలయం. శివుని ఐదు కేదార్లలో తుంగనాథ్ ఒకటి. ఉత్తరాఖండ్‌లో ఉన్న 5 పురాతన, పవిత్ర దేవాలయాలను పంచ కేదార్ అంటారు. మహాశివరాత్రి సందర్భంగా అత్యంత ఎత్తైన శివాలయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
తుంగనాథ్ ఆలయం 3,680 మీటర్ల (12,073 అడుగులు) ఎత్తులో చంద్రశిల పర్వతం మీద ఉంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. తుంగనాథ్‌ని సందర్శించాలంటే సోన్‌ప్రయాగ్ చేరుకోవాలి. దీని తరువాత గుప్తకాశీ, ఉఖిమత్, చోప్తా మీదుగా తుంగనాథ్ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయ చరిత్ర మహాభారతం అంత పురాతనమైనది. గ్రంధాల ప్రకారం పాండవ సోదరులలో మూడవ పెద్దవాడు అయిన అర్జునుడు ఆలయానికి పునాది వేశారు.
తుంగనాథ్ ఆలయానికి సంబంధించిన మహాభారత పురాణ కథ..
తుంగనాథ్ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రసిద్ధ కథనం ఉంది. వేల సంవత్సరాల క్రితం పాండవ సోదరులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. నిజానికి మహాభారత యుద్ధంలో, పాండవులు తమ సోదరులను, గురువులను చంపారు. పాండవులకు తమ బంధువులను చంపిన పాపం తగిలిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో వ్యాస మహర్షి పాండవులను శివుడు క్షమించినప్పుడే పాపం నుండి విముక్తులవుతారని చెప్పాడు. అప్పుడు పాండవులు శివుడిని వెతకడం ప్రారంభించి హిమాలయాలకు చేరుకున్నారు. చాలా కష్టపడుడుతుండగా శివుడు గేదె రూపంలో వారికి దర్శనం ఇచ్చాడు. అయితే పాండవులు దోషులని తెలిసి శివుడు వారిని తప్పించుకుని భూగర్భంలోకి వెళ్ళాడు. తరువాత అతని శరీర భాగాలు (గేదె) ఐదు వేర్వేరు ప్రదేశాలకు చేరుకున్నాయి.
ఈ అవయవాలు ఎక్కడ కనిపించినా పాండవులు అక్కడ శివాలయాలు నిర్మించారు. ఈ ఐదు గొప్ప శివాలయాలను 'పంచ కేదార్' అంటారు. ప్రతి ఆలయం శివుని శరీరంలోని ఒక భాగంతో గుర్తిస్తారు. తుంగనాథ్ పంచకేదార్లలో మూడవది. (తృతీయకేదార్) తుంగనాథ్ ఆలయ స్థలంలో శివుని చేతులు కనుగొన్నారు. దీని ఆధారంగానే దేవాలయం పేరు కూడా పెట్టారు. తుంగ్ అంటే చేతి, నాథ్ శివుడిని సూచిస్తుంది.
తుంగనాథ్ ఆలయంతో పాటు ‘పంచకేదార్’లో కేదార్‌నాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్ ఉన్నాయి. కేదార్‌నాథ్‌లో భగవంతుని మూపురం కనిపించింది. రుద్రనాథ్‌లో అతని తల, కల్పేశ్వర్‌లో జుట్టు, ఆయన నాభి మహేశ్వర్‌లో దర్శనం ఇస్తుంది.
చలికాలంలో పూజారులు ఇతర ప్రాంతాలకు వెళతారు..
చలికాలంలో ఈ ప్రదేశం మంచుతో కప్పి ఉంటుంది. ఆ సమయంలో ఆలయం మూసివేసి ఉంచుతారు. పూజారులు ముక్కుమట్‌కు వెళతారు. ఈ ప్రదేశం ప్రధాన ఆలయానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు ఏప్రిల్, నవంబర్ మధ్య ప్రధాన ఆలయాన్ని సందర్శించవచ్చు.
రాముని కథ..
పురాణాల ప్రకారం తుంగనాథ్‌కు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రశిల వద్ద ధ్యానం చేసేందుకు శ్రీరాముడు తరిలారు. లంకా రాజైన రావణుడిని చంపిన తరువాత శ్రీరాముడు బ్రహ్మను చంపిన పాపానికి పాల్పడ్డాడని చెబుతారు. ఈ పాపం నుండి విముక్తి పొందేందుకు చంద్రశిల కొండపై కొంతకాలం తపస్సు చేశాడు. చంద్రశిల శిఖరం 14 వేల అడుగుల ఎత్తులో ఉంది.