Tulasi: తులసి మొక్క ఇంట్లో ఈ వైపు ఉంటే ఐశ్వర్యం మీ సొంతం!

by Prasanna |
Tulasi: తులసి మొక్క ఇంట్లో ఈ  వైపు ఉంటే  ఐశ్వర్యం మీ సొంతం!
X

దిశ, వెబ్ డెస్క్ : తులసి మొక్క ప్రతి ఇంటిలో ఉండాలిసిన మొక్క. తులసి మొక్కకు చాలా ప్రాధ్యానత ఉంది. ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. తూర్పు వాయవ్యం లేదా ఉత్తర వాయవ్యాలలో తులసి మొక్క అడుగు భాగం కన్నా ఎత్తులో ఉండేటట్లు చూసుకోవాలి.. ఎందుకంటే ప్రదక్షిలు చేయడానికి వీలుగా ఖాళీ స్థలం ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సరి హద్దు గోడలను ఆనుకోని తులసి మొక్కను ఉంచరాదు. దక్షణ దిక్కున ఈ మొక్కను ఉంచాలనుకున్నపుడు నేల మట్టానికి సమానంగా ఉండకుండా చూసుకోవాలి. కొంచం ఎత్తు లేదా మరి కొంచం పల్లంలో కానీ ఉంచడం మర్చిపోకూడదు. ఈశాన్యం , తూర్పు ఈశాన్యం , ఉత్తర ఈశాన్యం దిశల్లో తులసి మొక్కలను ఉంచకూడదు. అలా చేస్తే ఈశాన్యం బరువు పెరిగి వినాశానికి దారి తీస్తుంది. ఆగ్నేయ , పశ్చిమ వాయవ్య దిశల్లో మాత్రమే తులసి మొక్కని ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది.

Advertisement

Next Story