- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Non Veg: హిందూ శాస్త్రం ప్రకారం మాంసాహారం తినకూడదా.. శాస్త్రాలు , ఏం చెబుతున్నాయంటే?

దిశ, వెబ్ డెస్క్ : ఈ భూమి మీద పుట్టిన జీవిరాశులలో మనుషులు మాత్రమే జాతి, కులం, మతం అంటూ పట్టించుకుంటారు. కానీ, జంతువులు అలా కాదు.. మనం వాటికీ ప్రేమతో ఏది అయిన ఆహారం పెడితే అవి విశ్వాసాన్ని చూపిస్తాయి. కానీ, మనుషులు జంతువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు.
మనం ఎలా అయితే, మనం ఎలా అయితే స్వేచ్ఛను కోరుకుంటామో జంతువులు కూడా అలాగే స్వేచ్ఛను కోరుకుంటాయి. కానీ, కొంతమంది జంతువులను చంపి తినే వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు. ఇలా చేసే వారిలో ఎంత డబ్బున్న వాళ్ళైనా వాళ్లది అసుర ప్రవృత్తి కిందకే వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
నాన్ వెజ్ ( Non veg ) తినకుండా మానేస్తే వందేళ్లు తపస్సు చేసిన ఫలం లభిస్తుందని అంటున్నారు. ఒక ప్రాణిని హింసించి వాటిని చంపి తినడం మానవ జన్మలో రాయలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. చివరికి పశుపక్ష్యాదులను మాంసం అసలు ముట్టవు. ఆవు,గేదె, లేడీ, గుర్రం వంటి జంతువులు ఆకులు తప్ప వేటిని తినవు. నికృష్ట జీవులుగా చెప్పబడే పులి,నక్క,తోడేలు వంటివి మాంసాన్ని తింటూ ఉంటాయి. ఇక, మనలో కొందరైతే వారంలో నాలుగు రోజులు తింటారు. పురాణాల్లో మాంసం తినే జీవులను నికృష్ట జీవులుగా పిలుస్తారు. హిందూ శాస్త్రం ప్రకారం, మానవ జన్మ ఎత్తినప్పుడు జంతువులను హింసించరాదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.