Sivayogam: శివయోగం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

by Prasanna |
Sivayogam: శివయోగం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
X

దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఈ సమయంలో ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ఇదిలా ఉండగా.. బుధుడు, సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా శివయోగం ఏర్పడబోతోంది. వచ్చే రెండో వారంలో కొన్ని రాశుల వారికి శుభంగానూ, మరి కొన్ని రాశులకు అశుభంగానూ ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

సింహరాశి

సింహ రాశి వారికి శివ యోగం కారణంగా వ్యాపారాలల్లో లాభాలు పొందుతారు. మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరేవేరుతుంది. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలన్నీ పరిష్కారమవుతాయి.

తులారాశి

శివ యోగం కారణంగా తులా రాశి వారికి శుభంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన వారు అధిక లాభాలు పొందుతారు. మీరు పని చేసే ఆఫీసులో జీతంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో మీ జీవిత భాగస్వామి సపోర్ట్ ఉంటుంది. పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి చేరుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed