Gorakhnath Swami : 800 ఏండ్ల పురాతనమైన గుహాలయాలు.. ఒక్కసారి చూశారంటే ఔరా అనాల్సిందే..

by Sumithra |
Gorakhnath Swami : 800 ఏండ్ల పురాతనమైన గుహాలయాలు.. ఒక్కసారి చూశారంటే ఔరా అనాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : మనదేశంలో అనేక పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు నెలకొని ఉన్నాయి. ఒక్కో ఆలయానికి, ఒక్కొ కట్టడానికి ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాంటి ఒక ఆలయమే 800 ఏండ్లనాడు కట్టిన గోరఖ్ నాథ్ గుహాలయం. ఇంతకీ ఈ ఆలయం వెనుక ఉన్న కథ ఏమిటి, దేవాలయం ఎక్కడ ఉంది ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలోని శ్రీనగర్‌లో గోరఖ్‌నాథ్ ఏకైక పురాతన గుహ దేవాలయం ఉంది. ఈ ఆలయమే కాకుండా 800 సంవత్సరాల నాటి మూడు గుహలు ఉన్నాయి. భైరవ నాథుడు స్వయంగా ఈ ఆలయ ద్వారం వద్ద రక్షకుడిగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. గోరఖ్‌నాథ్ స్వామిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. గోరఖ్‌నాథ్ ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలు తపస్సు చేసినట్లు చెబుతారు.

ఆలయ సంరక్షకుడు మంగళానంద్ పట్వాల్ ఈ ఆలయం గురించి చెబుతూ గోరఖ్‌నాథ్ ఆలయం పాత శ్రీనగర్ కాలం నుండి ఇక్కడే ఉందని తెలిపారు. అలకనందలో వరదల కారణంగా శ్రీనగర్ చాలాసార్లు కొట్టుకుపోయి ఆ తర్వాత స్థిరపడిందన్నారు. శ్రీనగర్ స్థాపించినప్పటి నుంచి గోరఖ్‌నాథ్ ఆలయం ఇక్కడ ఉందని చెబుతున్నారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, గోరఖ్‌నాథ్ ఆలయం సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించారని, ఇక్కడ ఇప్పటికీ గుహాలయాలు ఉన్నాయన్నారు.

గోరఖ్‌నాథ్ తపస్సు చేసిన గుహ..

గోరఖ్‌నాథ్ శివుని అవతారాలలో ఒకటని, ఇది ఒక సిద్ధపీఠమని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ మూడు గుహలు ఉన్నాయి. వాటిలో ఒకటి పెద్దది, రెండు చిన్న గుహలు. పెద్ద గుహలో 800 సంవత్సరాల నాటి గోరఖ్‌నాథ్ విగ్రహం ఉంది. గోరఖ్‌నాథ్ విగ్రహం ఉన్న గుహలోనే తపస్సు చేశాడు.

ఆలయ సంరక్షకుడు భైరవనాథుడు..

గుహ ప్రవేశ ద్వారం వద్ద బతుక్ భైరవనాథ్ ఆలయం ఉంటుంది. భైరవనాథుడు గోరఖ్‌నాథుని గుహను రక్షిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. భైరవనాథున్ని గోరఖ్‌నాథుడి శిష్యుడిగా చెబుతారు. గోరఖ్‌నాథున్ని దర్శిస్తేనే అన్ని కష్టాలు తొలగిపోతాయని దక్షిణ భారతదేశం నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed