ఉగాది నాడు అరుదైన శుభయోగాలు.. ఆ రాశుల వారికి లక్ష్మిదేవి కటాక్షం..

by Prasanna |   ( Updated:2024-03-15 04:23:09.0  )
ఉగాది నాడు అరుదైన శుభయోగాలు.. ఆ రాశుల వారికి లక్ష్మిదేవి కటాక్షం..
X

దిశ, ఫీచర్స్ : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది కూడా ఒకటి. ఈ పండుగతో హిందూ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ 9న వచ్చింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ రోజున మూడు అరుదైన యోగాలు కలవబోతున్నాయి. ఈ రోజున అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, శష్ రాజయోగం ఏర్పడతాయి. దీని వల్ల ఆ రాశుల వారు ప్రయోజనం పొందుతారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం

మకరరాశి

మకర రాశి వారు కొత్త సంవత్సరంలో అనేక ప్రయోజనాలను పొందుతారు. చాలా ఆస్తులు కొంటారు. మీ సంపద పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ కాలంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. ఈ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మేషరాశి

మేషరాశి వారికి నూతన సంవత్సరం గొప్పగా ఉండబోతుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీరు కీర్తిని సాధిస్తారు. మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపారస్తులు దీని వల్ల లాభపడతారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed