నవరాత్రులలో ఉపవాసం ఉంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

by Sumithra |
నవరాత్రులలో ఉపవాసం ఉంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
X

దిశ, వె‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : అక్టోబర్ 3 నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 11న నవమి పూజతో నవరాత్రులు ముగుస్తాయి. ఈ నవరాత్రులను భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో గుజరాత్‌లో గర్బా, దాండియా ఆటలతో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో దుర్గా మాతను అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. ఈ నవరాత్రి సమయంలో భక్తులు ఉపవాసం పాటిస్తూ, పూజలు చేస్తారు. అయితే ఈ సమయంలో కొంతమంది భక్తుల అలవాట్లతో వారి ఆరోగ్యం చెడిపోతుందంటున్నారు నిపుణులు. మరి ఆ పొరపాట్లేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.

నవరాత్రులలో భక్తులు తమ విశ్వాసాల ప్రకారం ఉపవాసం ఉంటారు. కొంత మంది రెండు, మూడు రోజులు ఉపవాసం ఉంటే మరికొంతమంది మాత్రం నవరాత్రులు మొత్తం ఉపవాసం ఉంటారు. ఉపవాసం సమయంలో రాత్రివేళ్లలో కిచిడి, పిండి వంటకాలు, పండ్లు మొదలైన వాటిని తింటారు. అయితే ఉపవాస సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్ని తప్పులను పునరావృతం చేస్తే ఆరోగ్యం క్షీణించవచ్చంటున్నారు నిపుణులు.

ఉపవాస సమయంలో జంక్ ఫుడ్ తినకూడదంటున్నారు నిపుణులు. అలాగే శరీరంలో నీటి కొరత రానివ్వవద్దంటున్నారు నిపుణులు. అధిక ఎక్కువ వ్యాయామం చేయకూడదు. BP, మధుమేహం మందులు వాడేవారు మందులను అస్సలు వదిలివేయవద్దు. కాఫీని తాగవద్దు. ఉపవాసం విరమించిన తర్వాత అతిగా కాకుండా లిమిట్ గా ఆహారాన్ని తీసుకోవాలి.

ఈ విషయాల పై కూడా శ్రద్ధ వహించాలి..

సమతుల్య ఆహారం తీసుకోండి..

పండ్లు, పిండి పదార్థాలు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉపవాస సమయంలో తినవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం వలన శరీరానికి పోషణ, శక్తి అందుతుంది. అలాగే యాపిల్, అరటి, బొప్పాయి, అనేక ఇతర పండ్లను తినవచ్చు.

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచాలి..

నవరాత్రి ఉపవాసం సమయంలో నీళ్లు పుష్కలంగా తాగాలి. తద్వారా శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల ఆరోగ్యం, చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి తగిన మోతాదులో నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ వంటి నీరు అధికంగా ఉండే ఆహారాలు కూడా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి.

స్నాక్స్ ఎంపిక..

కొంతమంది టీతో పకోరా లేదా చిప్స్ వంటి వాటిని తింటారు. కానీ ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారికి. అందుకే వీటికి బదులుగా వేయించిన గింజలు, ఫ్రూట్ సలాడ్ తినడం మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు.

Next Story