- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శక్తివంతమైన మాలవ్య యోగం.. ఆ రెండు రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం..
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, యోగాలు ఏర్పడడం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. మార్చి 31వ తేదీన మీనరాశిలో ఏర్పడే మాలవ్య యోగం మే 19 వ తేదీ వరకు ఉంటుంది.మార్చి 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు శుక్రుడు, మీన రాశిలోకి సంచరిస్తాడు. శుక్రుడు ప్రవేశించగానే మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం పంచ మహాపురుష యోగాలలో ఒకటి. ఈ యోగం వల్ల ఆ రెండు రాశుల వారికి శుభంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..
తులారాశి: ఈ ప్రత్యేక యోగ ప్రభావంతో తుల రాశి వారు ఊహించని విధంగా లాభపడనున్నారు. వారి పనికి తగిన గుర్తింపు రావడమే కాకుండా ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా పేరు, కీర్తి కూడా పెరుగుతాయి. మీరు మొదలు పెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు నుంచి ఉపశమనం దొరుకుతుంది.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొత్త పనులు మొదలు పెట్టిన వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కెరీర్‌లో పురోగతి, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో, వ్యాపారంలో ఉన్నవారు మళ్లీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.