Lord Shiva: శివుడు కలలో కనిపిస్తే.. ఏమి జరుగుతుంది?

by Prasanna |   ( Updated:2023-02-18 03:56:26.0  )
Lord Shiva: శివుడు కలలో కనిపిస్తే.. ఏమి జరుగుతుంది?
X

దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది ఎన్నో కలలను కంటుంటారు. వాటిలో కొన్ని పీడ కలలు , మరి కొన్ని పీడ కలలు ఉంటాయి. పీడ కలలు వచ్చినప్పుడు ఆందోళనకు గురవుతుంటారు. మంచి కలలు వచ్చినప్పుడు ఆ కలలను తలచుకుంటూ ఆందోళనకు గురవుతుంటారు. కల వచ్చిన సమయాన్ని బట్టి అది నిజమవుతుందా ? లేదా అన్నది శాస్త్రాలు బట్టి చెప్పవచ్చు.

కలలో శివుడు, శివ లింగం కనిపిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. పరమాత్ముడు కలలోకి రావడమంటే మాములు విషయం కాదు. ఏంతో అదృష్టం ఉంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని పండితులు తెలియజేస్తుంటారు. స్వామి వారిని నిత్యం కొలిచే వారికి అటువంటి భాగ్యం ఒక్కోసారి కలగదని పూర్వ జన్మ సుకృతం ఉంటుందని అంటుంటారు.

కలలో శివ లింగం రావడం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు . అనవసరంగా భయపడాలిసిన అవసరం కూడా లేదు. మనకి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడని శివ పురాణం నుంచి తెలియజేయబడింది. శివుడు కలలో కనిపిస్తే .. ఆయన యొక్క ఆశీస్సులు మీకు ఉన్నట్లే .. పదే పదే శివుడు కనిపిస్తే .. ఇంట్లో స్వామి వారికి పూజ చేయండి.

Advertisement

Next Story