- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటి టెర్రస్ పై ఈ వస్తువులు పెడుతున్నారా .. లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురైనట్టే.. !
దిశ, ఫీచర్స్ : వాస్తుశాస్త్రం ప్రకారం దిక్కులకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఇంట్లోని ప్రతిదిశలో ఒక ప్రత్యేక శక్తి ఉంటుందని, ఆ దిశలో ఉంచిన వస్తువులను బట్టి శక్తి మారుతుందని పండితులు చెబుతున్నారు. సరైన దిశలో సరైన వస్తువులు పెడితే ఇంట్లో ఆనందం, అదృష్టం ఉంటాయని చెబుతున్నారు. దిశలో పెట్టకూడని వస్తువులు పెడితే ప్రతికూలతలు ఏర్పడి గృహ సమస్యలు, ఇంట్లోని సభ్యులకు వ్యాధులు, ఇతర ఆర్థిక సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇంటి పైకప్పు వాస్తు విషయంలో కూడా ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి డాబా పై ఏయే వస్తువులను ఉంచాలి, ఏయే వస్తువులను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
పొరపాటున కూడా ఈ వస్తువులను పై కప్పు పై ఉంచకూడదు..
వ్యర్థాలు..
తరచుగా ఇంటిని శుభ్రపరిచిన తర్వాత ఉపయోగించని వస్తువులు బయటకు తీస్తారు. ఈ పాత వస్తువులను ఇంటి డాబా పై ఉంచడం అశుభకరంగా పరిగణిస్తారు. పనికి రాని పాత వస్తువులను ఇంటిలో, ఇంటిపైన పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.
ఆకులు..
చాలా మంది వ్యక్తులు తమ ఇళ్ల చుట్టూ లేదా వారి ఇంటి పై కప్పు పై కూడా చెట్లను పెంచుతారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి పై కప్పు పై ఎక్కువ కాలం చెత్తను పేరుకుపోనివ్వకూడదని చెబుతున్నారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని చెబుతున్నారు.
వెదురు..
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి పై కప్పు పై వెదురు కర్రలు ఉంచడం అశుభం.
చెక్క, తుప్పు పట్టిన వస్తువులు..
ఇంటి పై కప్పుపై చెత్త, పాత వార్తాపత్రికలు, విరిగిన చెక్క ఫర్నిచర్, తుప్పు పట్టిన వస్తువులు మొదలైనవి ఉంచవద్దు. ఈ వస్తువులను టెర్రస్ పై ఉంచడం వల్ల ఇంటి పై ప్రతికూల శక్తి ప్రభావం చూపిస్తుంది.
ఇంటి పై కప్పు వీటిని పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి..
ఇంటి పై కప్పు పై మొక్కలు నాటడం వల్ల పర్యావరణం ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఇంట్లో సానుకూలత ఏర్పడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి, బంతిపూలు, కలువ, పచ్చిగడ్డి, పుదీనా, పసుపు మొదలైన చిన్న మొక్కలను డాబాపై ఈశాన్య, తూర్పు దిక్కులలో నాటాలి. నీలం పువ్వులు ఉన్న మొక్కలను ఉత్తర దిశలో నాటాలి. పడమర దిశలో తెల్లటి పువ్వులతో కూడిన మొక్కలను నాటడం వల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుందని నమ్ముతారు.