శివరాత్రికి తొలిసారి ఉపవాసం ఉంటున్నారా?.. తక్షణమే ఈ విషయం తెలుసుకోండి..!

by GSrikanth |
శివరాత్రికి తొలిసారి ఉపవాసం ఉంటున్నారా?.. తక్షణమే ఈ విషయం తెలుసుకోండి..!
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూవులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మిగతా పండుగల్లాగా కాకుండా మనిషిని దైవానికి దగ్గర చేస్తుందని భావించే ఈ శివరాత్రిని అందరూ ప్రత్యేకంగా జరుపుకుంటారు. శరీరాన్ని నిరాహారంగా ఉంచి ఉపవాసం చేస్తారు. కొన్ని వేల సంవత్సరాల నుంచే శివరాత్రి పర్వదినాన్ని ఆచరిస్తున్న సందర్భాలు మన దేశ చరిత్రలో కనిపిస్తాయి. అయితే, శివరాత్రి రోజున పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించాడని కొందరు.. శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే అన్నది మరికొందరు పురాణాల్లో చెప్పుకొచ్చారు. అయితే, ఈ పండుగపూట అనేకమంది భక్తులు ఉపవాసం ఉంటుంటారు.

అయితే, తొలిసారి ఉపవాసం ఉండే భక్తుల్లో కొంత కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఏం తినాలి? ఏం తినకూడదో తెలియదు. వీరికి ముఖ్య పూజారులు కీలక సూచనలు చేశారు. ఆరోగ్యంగా ఉన్నవారు మంచి నీళ్లు తప్ప ఏమీ ముట్టొద్దని.. అనారోగ్యంతో ఉన్నవారు పండ్లు, పళ్ల రసాలు వంటివి తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఉపవాసం పాటించే వారు పొరపాటున కూడా ఉల్లి, వెల్లుల్లి తినకూడదని చెబుతున్నారు. శివరాత్రి ఉపవాసం చతుర్దశి తిథి నాడు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ముగుస్తుంది. దీనిని అందరూ గమనించాలని పేర్కొన్నారు.




Advertisement

Next Story

Most Viewed