ఆ ఆలయంలో ఆంజనేయుని కళ్యాణోత్సవం.. సతీసమేతంగా దర్శనం ఇస్తున్న హనుమాన్..

by Sumithra |
ఆ ఆలయంలో ఆంజనేయుని కళ్యాణోత్సవం.. సతీసమేతంగా దర్శనం ఇస్తున్న హనుమాన్..
X

దిశ, ఫీచర్స్ : బ్రహ్మచారులకు ఆరాధ్య దైవం ఆంజనేయుడు. అంతే కాదు ఆయన బ్రహ్మచారులకు ఆదర్శం. హనుమంతుని కథలను చెప్పాలంటే ముందుగా ఆయన బ్రహ్మచర్యం గురించే చెప్పుకుంటారు. కానీ ఆ బ్రహ్మచర్యానికే ఇప్పుడు ముప్పు వచ్చిపడింది.. ఎందుకంటే ఆయన సువర్చలా దేవిని వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.

అంతే కాదు ప్రతి ఏడాది తెలంగాణలోని ఖమ్మం జిల్లా యెల్నాడు గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో జ్యేష్ఠ మాసం పదవ రోజున హనుమంతుని కళ్యాణోత్సవం కూడా జరుపుకుంటారు. ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహంతో పాటు ఆయన సతీమణి సువర్చల కూడా కూర్చుని ఉంటుందట. కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో హనుమంతుడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఓ కథనం. హనుమంతుని వివాహం ఎలా జరిగిందో అతని అత్తమామల ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

హనుమంతుని వివాహ రహస్యం..

హనుమంతుని వివాహం గురించి పురాణ కథనం ప్రకారం హనుమంతునికి సూర్యభగవానుడు గురువు. హనుమంతుడు సూర్యదేవుని నుండి ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు. అయితే అవివాహితంగా ఉండటం ద్వారా పొందలేని కొంత జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని పొందాలంటే హనుమంతుడు వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందట. అప్పడు సూర్యదేవుడు ఒక ఉపాయం చెప్పి ఆయన కుమార్తె సువర్చలాదేవిని హనుమంతునికి ఇచ్చి వివాహం చేశాడట. సువర్చల కూడా బ్రహ్మచారిగా ఉంటూ తపస్సు చేయాలనుకుంది. అందువలన, సూర్యదేవుని సలహాతో హనుమంతుడు, సువర్చల వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఇక వివాహం తర్వాత సువర్చల తపస్సు కోసం వెళ్ళింది. హనుమంతుడు సూర్యదేవుని వద్ద జ్ఞానాన్ని సంపాదించుకోవడం ప్రారంభించాడు. ఈ విధంగా హనుమంతుడు బ్రహ్మచారిగా ఉన్నాడని పురాణ గాథ. ఈ వివాహం తర్వాత అతను సూర్య భగవానుడి నుండి జ్ఞానాన్ని పొందగలిగాడు. అయితే సువర్చలతో వివాహమైన తర్వాత హనుమంతునికి అత్తమామలతో బంధాలు ఏర్పడ్డాయి.

సూర్యభగవానుడితో హనుమంతుని బంధం..

సూర్యభగవానుడు ముందుగా హనుమంతునికి గురువు. అయితే సువర్చల సూర్యుడు తండ్రి కావడంతో హనుమంతునికి మామ అయ్యాడు. చిన్నతనంలో హనుమంతుడు ఉదయించే సూర్యుడిని పండుగా భావించి నోటిలోకి తీసుకునేలోపే ఇంద్రుడు హనుమంతుడిని పిడుగుపాటుతో కొట్టాడని ఒక కథనం.

హనుమంతుని అత్తగారు..

పురాణాలలో సూర్యదేవుని సంగ్య, ఛాయ అనే ఇద్దరు భార్యలు ఉన్నట్టు ప్రస్తావన. సంగ్య దేవశిల్పి విశ్వకర్మ కుమార్తె, ఆమె సూర్యభగవానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక తన ప్రతిరూపమైన నీడను సూర్యభగవానుడితో ఉంచింది. ఆమె గుర్రం రూపంలో భూమిపైకి వచ్చింది. ఇలా సూర్యదేవుని భార్యలు సంగ్య, ఛాయ ఇద్దరూ హనుమంతుడికి అత్తగారు అయ్యారు.

శని, యమరాజుతో హనుమంతుని బంధం..

యమరాజు, శనిదేవుడు ఇద్దరూ సూర్య భగవానుని కుమారులని పురాణాలలో పేర్కొన్నారు. యమునా, భద్ర సూర్యదేవుని కుమార్తెలు. దాంతో హనుమంతుని బంధువులలో శని, యమరాజులతో పాటు, యమునా, భద్ర కూడా ఉన్నారు. హనుమంతుడు, శనిదేవుని గురించిన అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులో శనిదేవుడు హనుమంతుని భక్తులను ఎప్పుడూ వేధించడు. యమరాజు కూడా శని భక్తులను ఆశీర్వదిస్తాడు. యమరాజు హనుమంతునికి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనే వరం ఇచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed