ఆ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు.. మిస్టరీని ఛేదించలేకపోయిన శాస్త్రవేత్తలు..

by Sumithra |
ఆ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు.. మిస్టరీని ఛేదించలేకపోయిన శాస్త్రవేత్తలు..
X

దిశ, వెబ్ డెస్క్ : మన భారతదేశంలో ఇప్పటికీ సైన్స్‌కు కూడా ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. ఎంతో మంది సైంటిస్టులు ఆ రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నించినా విఫలం అవుతూనే ఉన్నారు. మన ప్రాచీన నాగరికత మూలాలుగా పురాతన కట్టడాలు నిలుస్తున్నాయి. ఎంతో మంది రాజులు తమ వారసత్వం ప్రతిబింభించే విధంగా ఎన్నో ఆలయాల నిర్మాణాన్ని చేపట్టేవారు. ఇలా దేశ వారసత్వ సంపదగా, ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఒక ఆలయంగా వర్ధిల్లుతోంది హంపివిట్టల దేవాలయం. ఈ ఆలయం మిస్టరీకి పెట్టింది పేరు. ఇంతకీ ఆ మిస్టరీ ఏంటి.. ఆలయ విశేషాలేంటి అనుకుంటున్నారా.. అయితే ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.


కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విట్టల దేవాలయం ప్రాచీన కాలంలో నిర్మించారు. ఈ ఆలయం నిర్మాణ శైలిపరంగా, చరిత్ర పరంగా ఎంతో గొప్పది. వేలాది సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా ఈ ఆలయ కట్టడం నిలుస్తుంది. ఈ ఆలయానికి వెళ్లిన భక్తులకు అక్కడ ఓ అద్భుతం తారసపడుంది. అందేంటంటే ఆలయంలో ఉండే స్తంభాల నుంచి సంగీత ధ్వనులు వినిపిస్తాయి.

ఆలయ చరిత్ర

పూర్వం 15వ శతాబ్ధంలో విజయనగర సామ్రాజ్య పాలకుల్లో ఒకరైన దేవరాయ 2 పరిపాలనలో హంపి విట్టల ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి విజయ విట్టల ఆలయం అనే మరోపేరు కూడా ఉంది. ఆ ఆలయం విట్టలుని ఆలయం అయినప్పటకీ ఇక్కడ విట్టలనుని విగ్రహం లేకపోవడం విశేషం. ఒకనాడు శ్రీమహావిష్ణువుకి ఈ ఆలయం చాలా గొప్పగా ఉన్నట్లు అనిపించిందంట. దీంతో ఆయన ఆ ఆలయాన్ని వదిలి పందర్ పూర్ కు విట్టల రూపంలో వెళ్లిపోయినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో సంగీత స్తంభాలు, రథం వంటి ఎన్నో అందమైన, అద్భుతమైన రాతి కట్టడాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలోకి ప్రవేశించిగానే విజయనగర సామ్రాజ్య కాలం నాటి కళాకారుల ప్రతిభ కనిపిస్తుంది. అద్భుతమైన శిల్పకలలతో కూడిన మహామండపం, రంగ మండపం, ఉత్సవ మండపం, దేవిమందిరం, కళ్యాణ మండపం, రాతి రథంలాంటివి ముఖ్యమైనవి.


ఈ ఆలయంలో సంగీతం వినిపించే 56 స్తంభాలను సరిగమ లేదా సంగీత స్తంభాలు అని కూడా అంటారు. ఈ స్తంభాలను తాకితే చాలు మనసుకు హాయిని కలించే సంగీతాన్ని వినిపిస్తాయి. ఇక్కడ ప్రతి స్తంభం మండపం పైకప్పుతో కలిపి ఉంటుంది. గంధపు చెక్కలతో ఈ స్తంభాలపై మీటితే చాలు సంగీత ధ్వనులు వినిపిస్తాయి. సంగీత వాయిద్యాల శైలిలో ప్రధాన స్తంభాలను నిర్మించారు. గంధపు చెక్కతో ముట్టుకుంటే సంగీతం ఎలా వస్తుంది అనే విషయాలపై ఎన్ని పరిశోధనలు చేసినా శాస్త్రీయ కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియలేదు.

Advertisement

Next Story