- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గరే ఎందుకుంటుందో తెలుసా.. కారణం అదే..
దిశ, వెబ్‌డెస్క్ : ముక్కోటి దేవుళ్లలో లక్ష్మీదేవి, విష్ణువుమూర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భగవంతుని దశావతారాల్లో విష్ణుమూర్తి అవతారం మొదటిది. ఈ అవతారంలో వైకుంఠంలోని పాలసముద్రంలో ఆదిశేషుని పైన విష్ణుమూర్తి సేదతీరుతూ ఉంటే లక్ష్మిదేవి శ్రీ హరి పాదాల వైపు కూర్చుని పాదాలను నొక్కుతూ ఉంటుంది. విష్ణుమూర్తి అంటే విశ్వానికి రక్షకుడు అని భక్తుల నమ్మకం. లక్ష్మిదేవి సంపదలు కురిపించినా ఎల్లప్పుడూ శ్రీ హరి పాదాలను నొక్కుతూ ఉంటుంది. మరి సిరులను కురిపించే లక్ష్మీదేవి ఎందుకు శ్రీహరి పాదాల చెంత కూర్చుంటుంది అనే విషయాల గురించి చాలా మందికి తెలిసిఉండదు. మరి ఈ విషయం పై పురాణాలు, ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పురాణ కథనం..
లక్ష్మీదేవి, విష్ణుమూర్తి గురించి ఎక్కువగా ప్రచారంలో ఉన్న పురానాలను చూసుకుంటే ఓ నాడు నారదమునీంద్రుడు లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి ఇలాగడిగాడట. అమ్మ లక్ష్మీదేవి ఎందుకు నీవు నిరంతరం విష్ణువు పాదాల చెంత కూర్చుని పాదాలు నొక్కుతూ ఉంటావు. అప్పుడు లక్ష్మీదేవి ఏం చెప్పిందంటే గ్రహాల ప్రభావం మానవమాత్రులపైనే కాదు.. దేవతల మీదకూడా ఉంటుంది. ఎంతటి మహాదేవుడైనా గ్రహప్రభావం నుంచి తప్పించులేరు. రాక్షసగురువు శుక్రాచార్యుడు పురుషుల పాదాలలో ఉంటాడు. అలాగే దేవగురువు స్త్రీల చేతులలో నివసిస్తాడు. స్త్రీలు పురుషుని పాదాలను తాకడం వలన దేవుడికి, రాక్షసుడికి మధ్య కలయిక ఉంటుంది. అలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. దీంతో పాటు శుభం జరుగుతుందని లక్ష్మీ దేవి నారదమునీంద్రునికి సెలవిచ్చిందట. ఈ విషయాన్ని పలు పురాణాలలో తెలిపినట్టు పండితులు చెబుతున్నారు. అందుకే గృహిణులు తమ భర్తల పాదాలను తాకితే శుభం కలుగుతుందని చెప్తారు.