- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అశ్వత్థాముడు శివునికి మొదటి పూజ చేసే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..
దిశ, ఫీచర్స్ : భారతదేశాన్ని దేవాలయాల దేశం అని పిలుస్తారు. ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటిలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకతల గురించి విన్నారంటే ఆశ్చర్యానికి గురవుతారు. రహస్యాలతో నిండిన ఈ దేవాలయాలలో అశ్వత్థాముడు స్వయంగా పూజించడానికి వచ్చిన ఆలయం కూడా ఒకటి ఉంది. ఇదే అశ్వత్థామను శ్రీ కృష్ణ భగవానుడు మహాభారత యుద్ధంలో జీవితాంతం సంచరించమని శపించాడట.
ఆ ఆలయం ఎక్కడ ఉంది ?
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఉన్న అసిర్‌ఘర్ కోటలో పురాతన శివాలయం ఉంది. ఈ కోట రామాయణ కాలంలో అంటే 14వ శతాబ్దంలో నిర్మించారు. శాపం తర్వాత అశ్వత్థాముడు గత 5 వేల సంవత్సరాలుగా బుర్హాన్‌పూర్‌లోని ఈ కోటలో సంచరిస్తున్నాడని నమ్ముతారు.
అశ్వత్థామ ముందుగా శివున్ని పూజిస్తాడు..
అశ్వత్థామ మొదట బ్రహ్మ ముహూర్త సమయంలో అసిర్‌ఘర్ కోటలోని శివాలయంలో శివుడిని ఆరాధించడానికి వెళతాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక్కడి పూజారులు ఉదయం ఆలయ తలుపులు తెరవకముందే, భోలేనాథ్ స్వామిని పూజించిన తర్వాత వెళ్లిపోతారని నమ్ముతారు. ప్రతిరోజూ ఉదయం శివలింగం పై తాజా పువ్వులు, వెలుగుతున్న దీపాలు వెలుగుతుంటాయని చెబుతారు. అలాగే అక్కడి స్థానికులు అశ్వత్థామకు సంబంధించిన అనేక కథలు చెబుతారు.
కోటకు సంబంధించిన ఇతర రహస్యాలు..
పురావస్తు బృందం కోట పశ్చిమ దిశలో తవ్వకాలు జరిపినట్లు చెబుతారు. ఈ సమయంలో వారు ప్రత్యేక విషయాలను కనుగొన్నారు. త్రవ్వకాల స్థలంలో భూగర్భంలో ఒక అందమైన రాజభవనం కనుగొన్నారు. రాజభవనం రాణి కోసం నిర్మించి ఉండవచ్చని చెబుతారు. ఈ రాణి ప్యాలెస్‌లో 20 రహస్య గదులు కనుగొన్నారు. పురావస్తు శాఖ ప్రకారం ప్యాలెస్ 100 బై 100 స్థలంలో నిర్మించారు. ఈ ప్యాలెస్‌లో స్నానపు చెరువు కూడా ఉంది. అంతేకాకుండా తవ్వకాల్లో జైలు కూడా కనిపించిందట. జైలులో ఇనుప కిటికీలు ఉన్నాయి. అలాగే తలుపులు కూడా కనుగొన్నారు.